IPL 2025 Beautiful Cheerleader: IPL 2025 చీర్‌లీడర్లు ఏ అప్సరసలకు తీసిపోకుండా కనిపిస్తారు. ఇప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన ఒక చీర్‌లీడర్ (IPL 2025 Beautiful Cheerleader) తన అందంతో చర్చల్లో నిలిచింది. ఆమె పేరు మాలీ. ఆమె గతంలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున కూడా చీర్‌లీడింగ్ చేసింది. ఆమె ఫోటోలు, కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. మాలీ అందంలో బాలీవుడ్, హాలీవుడ్ నటీమణులను సైతం ఓడిస్తుంది.
మాలీ వయస్సు 24 సంవత్సరాలు. ఆమె ఇంగ్లాండ్ నివాసి. ఈస్ట్ యార్క్‌షైర్ నుండి వచ్చింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో నిత్యం తన ఆకర్షణీయమైన, అందమైన ఫోటోలను పంచుకుంటుంది. ఆమె ప్రతి పోస్ట్‌కు క్షణాల్లో వేలాది లైక్‌లు వస్తాయి. ఈ వార్త రాసే సమయానికి ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో 7,000 మందికి పైగా ఫాలో అవుతున్నారు. మాలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి ఆమెకు ప్రయాణం అంటే చాలా ఇష్టమని, తరచూ తన స్నేహితులతో ఫోటోలను పంచుకుంటుందని తెలుస్తుంది. ఆమె ఫిట్‌నెస్ విషయంలో కూడా ఎవరికీ తీసిపోదు.
Also Read: Ola Electric : ఆంధ్రప్రదేశ్‌లో రోడ్‌స్టర్ X డెలివరీలను ప్రారంభించిన ఓలా ఎలక్ట్రిక్
మాలీ IPLలో చెన్నై సూపర్ కింగ్స్ తరపున చీర్‌లీడింగ్ చేసింది. ఆ ఫోటోలు ఆమె సోషల్ మీడియాలో అందుబాటులో ఉన్నాయి. మాలీ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర క్రీడా ఈవెంట్‌లలో కూడా చీర్‌లీడింగ్ చేసింది.
మాలీ ఎంత డబ్బు వసూలు చేస్తుంది?
ఒక మీడియా నివేదిక ప్రకారం.. మాలీకి సన్‌రైజర్స్ హైదరాబాద్ ఒక్కో మ్యాచ్‌కు 14,000-16,000 రూపాయల జీతం ఇస్తుంది. ఒకవేళ జట్టు ప్లేఆఫ్‌కు చేరకపోయినా.. ఒక చీర్‌లీడర్ మొత్తం సీజన్‌లో 2 లక్షల రూపాయలకు పైగా సంపాదిస్తుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి చెప్పాలంటే.. ఆ జట్టు IPL 2025 ప్లేఆఫ్‌కు చేరలేదు. SRH ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 6 విజయాలు సాధించింది. హైదరాబాద్ జట్టు పాయింట్స్ టేబుల్‌లో ఆరవ స్థానంలో నిలిచింది. అంటే మాలీకి ఈ సీజన్‌లో దాదాపు రూ. 2,24,000 సంపాదించినట్లు తెలుస్తోంది.