RCB vs RR: ఐపీఎల్ మొదటి ఎలిమినేటర్ మ్యాచ్ మే 22 న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆరంభం నుంచి టేబుల్ టాపర్ గా కొనసాగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు లీగ్ దశ ముగిసే సమయానికి మూడవ స్థానానికి పడిపోయింది.
వాస్తవానికి ఆదివారం గౌహతిలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయిన కారణంగా ఆర్ఆర్ మూడవ స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ఈ క్రమంలో కేకేఆర్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా, రెండవ స్థానంలో ఎస్ఆర్హెహెచ్ కొనసాగ్గుతుంది. కాగా ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టు రెండో క్వాలిఫయర్‌లోకి ప్రవేశిస్తుంది.మరి ఐపీఎల్ చరిత్రలో ఇంతకు ముందు ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌లో ఎప్పుడు తలపడ్డాయో చూద్దాం.
ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో రాజస్థాన్ రాయల్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండుసార్లు తలపడ్డాయి. అయితే ఇందులో ఇరు జట్లు ఒక్కో మ్యాచ్ ఓడిపోయాయి. 2015లో తొలిసారిగా ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ, ఆర్‌ఆర్‌లు తలపడ్డాయి. ఆ తర్వాత ఆర్సీబీ 71 పరుగుల భారీ తేడాతో ఆర్ఆర్‌ను ఓడించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 180 పరుగులు చేసింది. ఏబీ డివిలియర్స్, మన్‌దీప్ సింగ్ అర్ధ సెంచరీలు చేశారు. ఆపై హర్షల్ పటేల్, శ్రీనాథ్ అరవింద్, డేవిడ్ వీస్, యుజ్వేంద్ర చాహల్ తలో రెండు వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్ వెన్ను విరిచారు. ఆర్సీబీ 109 పరుగులకే ఆలౌట్ అయింది.
2022 సీజన్ రెండో క్వాలిఫయర్‌లో RCB మరియు ఆర్ఆర్ తలపడ్డాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోను ఓడించి బెంగళూరు రెండో క్వాలిఫయర్‌లోకి ప్రవేశించగా, తొలి క్వాలిఫయర్‌లో రాజస్థాన్ రాయల్స్ గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 157 పరుగులు చేసింది. రజత్ పాటిదార్ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ జోస్ బట్లర్ సెంచరీ సాధించడం ద్వారా RCB ఏడు వికెట్ల తేడాతో ఓడింది. గణాంకాలను పరిశీలిస్తే RCB మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందని భావిస్తున్నారు. RCB ప్లేఆఫ్స్‌కు చేరిన నాల్గవ జట్టుగా బరిలోకి దిగుతుంది, రాజస్థాన్ రాయల్స్ రెండవ జట్టుగా ఉంది. తొలిసారిగా ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకునేందుకు ఆర్‌సీబీ ప్రయత్నాలు చేస్తోంది. రాజస్థాన్ రాయల్స్ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.మరి ఈ ఉత్కంఠ పోరులో ఎవరు ఫైనల్ కి చేరుతారో మీ కామెంట్ చేయండి.
Also Read: AP Violence: కాకినాడ – పిఠాపురంలో ఇంటెలిజెన్స్ హెచ్చరిక