KKR Vs SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ చివరి స్టేజ్ కు చేరింది. లీగ్ స్టేజ్ లో పలు సంచలనాలు నమోదవగా… నాలుగు జట్లు ప్లే ఆఫ్ కు చేరుకున్నాయి. ఇవాళ జరిగే తొలి క్వాలిఫైయర్ లో కోల్ కతా నైట్ రైడర్స్ , సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ హైవోల్టేజ్ క్లాష్ అహ్మదాబాద్ వేదికగా జరగనుంది. లీగ్ స్టేజ్ ను టాపర్ గా ముగించిన కోల్ కతాను ఫేవరెట్ గా చెబుతున్నా…టోర్నీలో ఆరంభం నుంచీ అదరగొడుతున్న సన్ రైజర్స్ హైదరాబాద్ ను తేలిగ్గా తీసుకోలేం. ముఖ్యంగా ఈ సీజన్ లో అలవోకగా 250కి పైగా స్కోర్లు బాదేసిన రికార్డు సన్ రైజర్స్ ది. కాగా ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంటుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో ఈ మ్యాచ్ లో ఓడిన టీమ్ తలపడుతుంది.
We’re now on WhatsApp. Click to Join
జట్ల బలాబలాలను చూస్తే పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో నిలిచిన కోల్ కతా ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఫామ్ లో ఉంది. పలువురు ఆల్ రౌండర్లే ఆ జట్టుకు ప్రధాన బలం. ఓపెనర్ సునీల్ నరైన్ ఇటు బ్యాటింగ్ లోనూ , అటు బౌలింగ్ లోనూ చెలరేగిపోతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. అయితే మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ జాతీయ జట్టుకు ఆడేందుకు స్వదేశానికి వెళ్లిపోవడం కోల్ కతాకు ఎదురుదెబ్బగానే చెప్పాలి. మిగిలిన బ్యాటింగ్ లైనప్ లో వెంకటేశ్ అయ్యర్ , శ్రేయాస్ అయ్యర్ , నితీశ్ రాణా , ఆండ్రూ రస్సెల్ , రింకూ సింగ్ వంటి విధ్వంసకర ప్లేయర్స్ ప్రధాన బలం. అటు బౌలింగ్ లో మిఛెల్ స్టార్క్ , నరైన్, వరుణ్ ఆరోన్ , రస్సెల్ సత్తా చాటుతున్నారు.
Also Read :Fear Politics : ఎన్నికల్లో పోటాపోటీగా ఫియర్ పాలి‘ట్రిక్స్’
మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా సూపర్ ఫామ్ లో ఉంది. చివరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ పై భారీ టార్గెట్ ను అలవకోగా ఛేదించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో సమిష్టిగా రాణిస్తోంది. బ్యాటింగ్ పరంగా అభిషేక్ శర్మ , ట్రావిస్ హెడ్ , క్లాసెన్, త్రిపాఠీ అదరగొడుతున్నారు. బౌలింగ్ లో భువికి తోడుగా నటరాజన్ రాణిస్తున్నాడు. ఫలితంగా కోల్ కతాకతాకు ఏ మాత్రం తీసిపోని విధంగా సన్ రైజర్స్ హైదరాబాద్ కనిపిస్తోంది. అయితే లీగ్ స్టేజ్ లో రెండుసార్లు కోల్ కతా చేతిలో ఓడిపోవడం ఒక్కటే ప్రతికూలాంశం. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించనుంది. దీంతో టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడం ఖాయం.