IPL 2024 Playoffs Race: ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ ప్రయాణం ముగిసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ మరియు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో గుజరాత్ నష్టపోయింది.ఫలితంగా ప్లేఆఫ్ రేసు నుండి నిష్క్రమించింది. ఈ మ్యాచ్ రద్దు కావడంతో గుజరాత్, కేకేఆర్‌లకు చెరొక పాయింట్ లభించింది.
ఇప్పటికే కేకేఆర్ జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో టోర్నీ నుంచి జిటి టీం నిష్క్రమించాల్సి వచ్చింది. మొత్తానికి ప్లేఆఫ్‌ల రేసుకు దూరమైన మూడో జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. అంతకుముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ జట్లు ఐపీఎల్ ప్లేఆఫ్ రేసుకు దూరమయ్యాయి. ఇప్పుడు ప్లే ఆఫ్స్‌లో మిగిలిన 3 స్థానాల కోసం 6 జట్ల మధ్య పోరు సాగుతోంది. ఆ జట్లలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. గుజరాత్, కేకేఆర్ మ్యాచ్ రద్దు చేయడం వల్ల 7 జట్లు ప్రయోజనం పొందాయి. కేకేఆర్‌కే తొలి ప్రయోజనం దక్కింది. మ్యాచ్ రద్దు కావడంతో ఆ జట్టుకు ఒక పాయింట్ లభించగా, 13 మ్యాచ్‌ల్లో 19 పాయింట్లు సాధించింది. అయితే . గత రెండు సీజన్లలో ఫైనల్స్‌కు చేరిన గుజరాత్.. తొలిసారి ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోయింది.
ఈ సీజన్‌లో గుజరాత్ ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడగా ఆ జట్టు మొత్తం 11 పాయింట్లు మాత్రమే సాధించింది. గుజరాత్ ఈ సీజన్‌లో ఇంకా ఒకే ఒక్క మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ గెలిచినా శుభమాన్ గిల్ సేన 13 పాయింట్లను మాత్రమే చేరుకోగలదు. కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటికే 14 పాయింట్లతో ఉన్నాయి. కాగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ రద్దయ్యాక కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి క్వాలిఫయర్‌లో స్థానం ఖాయం చేసుకుంది. అయితే తొలి క్వాలిఫయర్‌లో కేకేఆర్ ఏ జట్టుతో తలపడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
Also Read; RCB captain: ఆర్సీబీ కెప్టెన్ మారబోతున్నాడా..? హర్భజన్ కామెంట్స్ వైరల్