IPL 2024 Final: ఈ తప్పిదాలే సన్ రైజర్స్ కు శాపంగా మారాయి

పదేళ్ల తర్వాత నిరీక్షణ తర్వాతా గౌతమ్ గంభీర్ హయాంలో కేకేఆర్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ లో కేకేఆర్‌కి ఇది మూడో టైటిల్ కాగా హైదరాబాద్‌ రెండో టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే ఆరంభం నుంచి ప్రత్యర్థి జట్లను ధాటిగా ఎదుర్కున్న సన్ రైజర్స్ ప్రపంచ ఛాంపియన్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలోని సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఫైనల్లో దారుణంగా ఓటమి పాలయింది. కాగా ఈ పరాజయానికి చాలానే కారణాలున్నాయి.

IPL 2024 Final: రసవత్తరంగా సాగిన ఈ సీజన్ ఐపీఎల్ ఫైనల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఆ జట్టు టైటిల్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పదేళ్ల తర్వాత నిరీక్షణ తర్వాతా గౌతమ్ గంభీర్ హయాంలో కేకేఆర్ ట్రోఫీని గెలుచుకుంది. ఐపీఎల్ లో కేకేఆర్‌కి ఇది మూడో టైటిల్ కాగా హైదరాబాద్‌ రెండో టైటిల్‌ను చేజార్చుకుంది. అయితే ఆరంభం నుంచి ప్రత్యర్థి జట్లను ధాటిగా ఎదుర్కున్న సన్ రైజర్స్ ప్రపంచ ఛాంపియన్‌ కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ నేతృత్వంలోని సన్ రైజర్స్ 8 వికెట్ల తేడాతో ఫైనల్లో దారుణంగా ఓటమి పాలయింది. కాగా ఈ పరాజయానికి చాలానే కారణాలున్నాయి.

ఫైనల్లో టాస్ గెలిచిన పాట్ కమిన్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వాస్తవానికి కమిన్స్ తీసుకున్న ఈ నిర్ణయం తప్పని రుజువైంది. అసలే చెన్నైలో వర్షం కురిసింది. పిచ్ పరిస్థితిని అంచనా వేయకుండా కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో కోల్‌కతా బౌలర్లు చెలరేఁగ్గిపోయారు. ఈ సీజన్‌ ఆరంభం నుంచి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓపెనర్లపైనే ఎక్కువగా ఆధారపడింది. అది తప్పని టైటిల్ పోరులో రుజువైంది. ఓపెనర్లు అభిషేక్ శర్మ మరియు ట్రావిస్ హెడ్ నుండి భారీ ఇన్నింగ్స్‌ ఆశించినప్పటికీ ఇద్దరూ చేతులెత్తేశారు. మొదటి, రెండవ ఓవర్లలో ఈ స్టార్ బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకున్నారు. అభిషేక్‌ను మిచెల్ అవుట్ చేయగా, అవుట్‌గోయింగ్ బంతికి నితీష్ రాణా ట్రావిస్ హెడ్‌కు కళ్లెం వేశాడు.ఓపెనర్లు విఫలం అయినా.. మిగతా బ్యాటర్లు కూడా పరిస్థితి తగ్గట్లు ఆడలేదు.

మిడిలార్డర్ బ్యాట్స్ మెన్లు నిలకడగా ఆడకుండా భారీ షాట్లు ఆడే క్రమంలో వికెట్లు సమర్పించుకున్నారు. రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ క్రీజులో ఎక్కువసేపు నిలవకపోవడంతో జట్టు స్కోర్ ఏ మాత్రం ముందుకు కదల్లేదు. ఒకవైపు కేకేఆర్ బౌలర్లు చెలరేగుతుంటే హైదరాబాద్ బ్యాటర్లు వారికి దాసోహమవ్వడం జట్టు విజయాన్ని దెబ్బకొట్టింది. అంతేకాదు ఛేదనలో హైదరాబాద్ బౌలర్లు పేవలమైన బంతులతో నిరాశపరిచారు. అయితే స్కోరు చాలా తక్కువగా ఉండటంతో హైదరాబాద్ బౌలర్లు వికెట్లు తీసే దిశగా వెళ్లలేదు. ఇకపోతే ఈ సీజన్‌లో కేకేఆర్‌, హైదరాబాద్‌ మూడుసార్లు తలపడ్డాయి. ఇందులో కేకేఆర్ మూడు సార్లు గెలిచింది. తొలి మ్యాచ్‌లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత క్వాలిఫయర్-1లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు పరాజయాల ఒత్తిడి హైదరాబాద్ పై పడిందనడంలో సందేహాం లేదు.

Also Read: Doctors Arrest : ర్యాష్ డ్రైవింగ్ కేసు.. బాలుడి బ్లడ్‌ శాంపిల్​ను మార్చేసిన డాక్టర్లు అరెస్ట్