ఐపీఎల్ 2023లో పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చాహల్ నిలిచాడు. పంజాబ్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మను అవుట్ చేయడం ద్వారా చాహల్ ఈ ఘనత సాధించాడు. ఈ విషయంలో ముంబై ఇండియన్స్ మాజీ బౌలర్ లసిత్ మలింగను చాహల్ దాటేశాడు. స్పిన్ బౌలర్ ఇప్పుడు ఐపీఎల్‌లో మొత్తం 171 వికెట్లు సాధించాడు. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో లసిత్ మలింగ తన కెరీర్‌లో 170 వికెట్లు పడగొట్టాడు. అయితే మలింగ 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీయగా.. చాహల్ 133 మ్యాచ్‌ల్లో అతనిని అధిగమించాడు.
ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్ మాజీ బౌలర్ డ్వేన్ బ్రావో నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఈ లీగ్‌లో బ్రావో 161 మ్యాచ్‌లు ఆడి మొత్తం 183 వికెట్లు తీశాడు. బ్రావోని అధిగమించాలంటే చాహల్‌కు 13 వికెట్లు అవసరం. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్పిన్ బౌలర్ చాహల్ ను ఓ ఆట ఆడుకున్నారు. చాహల్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో 50 పరుగులు సమర్పించాడు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగాడు. అయితే టోర్నీ తొలి మ్యాచ్‌లో చాహల్ అద్భుత ప్రదర్శనతో నాలుగు వికెట్లు పడగొట్టాడు.
Also Read: KKR vs RCB: రెండో విజయం కోసం బెంగళూరు.. తొలి గెలుపు కోసం కోల్‌కతా..!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా చాహల్ ఓ ఘనత సాధించాడు. టీ20 క్రికెట్‌లో 300కి పైగా వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చాహల్ నిలిచాడు. మయాంక్ అగర్వాల్‌ను పెవిలియన్‌కు పంపడం ద్వారా అతను ఈ ఘనత సాధించాడు. చాహల్ మినహా, ఈ ఫార్మాట్‌లో భారత్‌కు చెందిన ఏ బౌలర్ కూడా 300 వికెట్ల సంఖ్యను తాకలేకపోయారు.