CPL 2023: క్రికెట్ బాహుబలి

క్రికెట్ లో కొన్ని సన్నివేశాలు చూస్తే నవ్వాలో జాలి పడాలో అర్ధం కాదు. చిత్ర విచిత్రాలు క్రికెట్ మైండంలోనే చూడాల్సి వస్తుంది. నిజానికి క్రికెట్ లో ఫిట్ నెస్ చాలా అవసరం,

CPL 2023: క్రికెట్ లో కొన్ని సన్నివేశాలు చూస్తే నవ్వాలో జాలి పడాలో అర్ధం కాదు. చిత్ర విచిత్రాలు క్రికెట్ మైదానంలోనే చూడాల్సి వస్తుంది. నిజానికి క్రికెట్ లో ఫిట్ నెస్ చాలా అవసరం, ఫిట్ నెస్ కోల్పోయి ఎంతో మంది ఆటగాళ్లు తమ కెరీర్ ని నాశనం చేసుకున్నారు. కానీ అక్కడక్కడా మనకు బాహుబలి లాంటి క్రికెట్ ఆటగాళ్లు తారసపడతారు. ఒకప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ ఇంజమామ్-ఉల్-హక్ తన భారీకాయంతో క్రికెట్ లో రికార్డులు సృష్టించాడు. సింగిల్స్ జోలికి వెళ్లని ఇంజమామ్ ఫోర్లు సిక్సర్లతో బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తాడు. కానీ క్రికెట్ లో సింగిల్స్ పాత్ర చాలానే ఉంటుంది. కాబట్టి ఇంజమామ్ సింగిల్స్ తీయాల్సి వచ్చినప్పుడల్లా రన్ అవుట్ అయ్యేవాడు. అందుకే ఫోర్లు, సిక్సర్లని మాత్రమే ఎంచుకునేవాడు. చూడటానికి ఎంతో బబ్లీగా ఉండే ఇంజిమామ్‌ అలవోకగా సిక్సులు బాదేవాడు.

క్రికెట్లో ఇంజమామ్ని బాహుబలిగా పోలిస్తే ఇప్పుడు వెస్టిండీస్ క్రికెటర్ రఖీమ్ కార్న్​వాల్ ని బాహుబలి2 గా పోల్చుతున్నారు. ప్రస్తుతం వెస్టిండీస్ లో కరీబియన్ ప్రీమియర్ లీగ్​ నడుస్తుంది. సెయింట్ లూసియా, బార్బడోస్​ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. బార్బడోస్​ రాయల్స్ తరుపున ఆడుతున్న కార్న్​వాల్ రనౌట్ అయిన తీరు ప్రతిఒక్కరిని కడుపుబ్బా నవ్విస్తుంది. కార్న్​వాల్ కొట్టిన ఒక షాట్​ను ఫీల్డర్ అందుకోలేకపోవడంతో నాన్​స్ట్రైక్​లో ఉన్న కైల్ మైర్స్ రన్ కోసం పరిగెత్తాడు. దీంతో కార్న్​వాల్ పరుగెత్తాల్సి వచ్చింది. భారీకాయుడైన కార్న్​వాల్ వేగంగా ఉరకలేక చేతులెత్తేశాడు. ఫీల్డర్ డైరెక్ట్ త్రో చేయడంతో కార్న్​వాల్ రనౌట్​గా వెనుదిరిగాడు. ఈ రనౌట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడ్ని ఇంజమామ్​తో పోలుస్తున్నారు. నిజానికి కార్న్​వాల్ స్థానంలో మరో ఆటగాడు ఉండి ఉంటే సునాయాసంగా పరుగు తీయగలడు. ఏ మాత్రం అవుట్ అయ్యే ఛాన్స్ కాదది. కానీ అక్కడ ఉన్నది కార్న్​వాల్ కాబట్టి రన్ అవుట్ కాకా తప్పలేదు.

Also Read: Jayaprada : బీఆర్ఎస్‌లోకి జయప్రద.. ? పోటీ ఎక్కడి నుండి అంటే..