Site icon HashtagU Telugu

Inzamam-ul-Haq: ఇంజమామ్‌ రాజీనామా

Inzamam Ul Haq

Inzamam Ul Haq

Inzamam-ul-Haq: ప్రపంచ కప్ లో పాకిస్థాన్ పేరు కూడా వినిపించట్లేదు. టైటిల్ ఫెవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాకిస్థాన్ ఘోరంగా విఫలం చెందింది. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవలం రెండు మ్యాచుల్లో విజయం సాధించి నాలుగు అపజయాలను మూటగట్టుకుంది. తద్వారా సెమీస్ చేరే అవకాశాలను దాదాపుగా కోల్పోయింది. దీంతో పాక్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది. పైగా బాబర్ అజమ్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్‌ కప్‌ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌ చీఫ్‌ సెలక్టర్‌ ఇంజమామ్‌ ఉల్‌ హక్‌ తన పదవికి రాజీనామా చేశాడు.ఇంజమామ్‌ తన రాజీనామాను పీసీబీ చీఫ్‌ జకా అష్రఫ్‌కు పంపించాడు.

పాక్ తరఫున ఇంజమామ్ 75 వన్డేలు ఆడి 11701 పరుగులు చేశాడు. వన్ డేలో 10 సెంచరీలు, 83 అర్ధ సెంచరీలు ఉన్నాయి.120 టెస్టులు ఆడి 8830 పరుగులు చేశాడు. టెస్టులో 25 సెంచరీలు, 46 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 1992లో పాకిస్థాన్ ప్రపంచకప్ గెలిచింది. ఆ జట్టులో ఇంజమామ్ కీలక ఆటగాడిగా కొనసాగాడు.

Also Read: CM KCR: 1956లో తెలంగాణను ఆంధ్రాలో విలీనానికి కారణం కాంగ్రెస్సే