Site icon HashtagU Telugu

Inspiring Journey Of Deepthi Jeevanji : అప్పుడు హేళన..ఇప్పుడు ప్రశంసలు

Deepthi Jeevanji

Deepthi Jeevanji

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది దీప్తి జీవన్‌జీ (Deepthi Jeevanji). వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన ఈమె..చిన్నప్పటి నుంచి అథ్లెటిక్స్‌ విజయం సాధించాలనే పట్టుదలతో ఉండేది. పుట్టినప్పటి నుంచి మేధస్సు బలహీనంగా ఉండడంతో గ్రామస్తులు, బంధువులు హేళన చేయడం , అవమానించడం ఇలా ఎన్నో చేసేవారు కానీ వారి హేళనలు ఏమాత్రం పట్టించుకోకుండా… కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో తనదైన ముద్ర వేసింది. ప్రపంచ రికార్డు పారా అథ్లెట్‌గా పారాలింపిక్స్‌ (World Para-Athletics Championships) బరిలోకి దిగిన దీప్తి..మూడో స్థానంలో నిలిచి క్యాంస్య పతకాన్ని సాధించింది.

పట్టుదల ముందు మానసిక వైకల్యం ఏమాత్రం పనిచేయదని నిరూపించింది. ఆత్మబలంతో ముందుకుసాగి విజయాన్ని సొంతం చేసుకొని దేశం మొత్తం ఇపుడు గర్వయించే స్థాయికి ఎదిగింది. దీప్తి విజయాన్ని హర్షిస్తూ ఆమె స్వగ్రామంలో గ్రామస్థులు, పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు, స్నేహితులు , జిల్లా వాసులు ఇలా అంత సంబరాలు చేసుకుంటున్నారు. ఒకప్పుడు హేళన చేసిన వారే ఇప్పుడు శభాష్..మా ఉరికి ,. మా జిల్లాకు పేరు తెచ్చిందని కొనియాడుతున్నారు. ప్రధాని మోడీ , రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము, కేంద్ర మంత్రి అమిత్ షా..తెలంగాణ సీఎం రేవంత్ ఇలా ప్రతిఒక్కరు దీప్తిని అభినందిస్తూ ప్రశంసలు కురిపించారు.

We’re now on WhatsApp. Click to Join.

పారిస్ పారాలింపిక్స్‌ మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో కాంస్యం గెలిచినందుకు దీప్తి జీవాంజికి అభినంద‌న‌లు. ఆమె అనేక ప్ర‌తికూల ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటూ ఆట‌పై అంకిత‌భావాన్ని ప్ర‌ద‌ర్శించింది. భ‌విష్య‌త్‌లో ఆమె ఇంకా ఉన్న‌త విజ‌యాల‌ను సాధించాల‌ని కోరుకుంటున్నాను అని రాష్ట్ర‌ప‌తి ట్వీట్ చేశారు. అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో పారాలింపిక్స్‌ మహిళల 400 మీటర్ల టీ20 ఫైనల్లో (400m T20 Category) కాంస్య ప‌త‌కం గెలిచినందుకు దీప్తి జీవాంజికి శుభాకాంక్ష‌లు. ఆమె చాలా మంది స్ఫూర్తికి మూలం. ఆట‌లో ఆమె నైపుణ్యం, ప‌ట్టుద‌ల అభినంద‌నీయం అని ప్ర‌ధాని మోదీ త‌న ట్వీట్‌లో రాసుకొచ్చారు. అటు ప్ర‌ధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా దీప్తిని అభినందించారు.

దీప్తి జీవన్‌జీ తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలం, కల్లెడ గ్రామంలో జీవన్‌జీ యాదగిరి, జీవన్‌జీ ధనలక్ష్మిలకు 2003 జన్మించింది. దీప్తి స్కూల్ స్కూల్ గ్రౌండ్‌లో స్నేహితులతో కలిసి నడుస్తున్న దీప్తిని పీఈ టీచర్ బియాని వెంకటేశ్వర్లు చూశాడు. దీప్తి ట్రాక్‌పై పరుగెత్తడాన్ని చూసి ఆమెకు సహాయం చేయాలని కోచ్ పాఠశాల యజమాని రామ్మోహన్ రావును అభ్యర్థించాడు. ఆమె పాఠశాల స్థాయిలో సామర్థ్యమున్న క్రీడాకారులతో పోటీ పడి 100 మీటర్లతో పాటు 200 మీటర్ల పరుగు పందెంలో కూడా పాల్గొంది. జాతీయ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, దీప్తి శిక్షణను చూసి, సికింద్రాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ ఇంటలెక్చువల్లీ డిసేబుల్డ్ పర్సన్స్‌లో దీప్తిని పరీక్షించమని కోచ్‌కి సలహా ఇచ్చాడు. మూడు రోజుల పరీక్ష తర్వాత, పారా పోటీలలో పాల్గొనడానికి ఓకే చెప్పారు. ఈ క్రమంలో పారా నేషనల్స్‌లో పోటీ పడింది. ఆ తర్వాత మొరాకోలో జరిగిన వరల్డ్ పారా గ్రాండ్ ప్రిక్స్‌లో, అలాగే ఆస్ట్రేలియాలో జరిగిన పారా ఓషియానియా పసిఫిక్ గేమ్స్‌లో 400 మీటర్ల టైటిల్‌ను గెలుచుకుంది. తాజాగా మంగళవారం(సెప్టెంబర్ 03)న రాత్రి పారిస్​లో జరిగిన 400 మీటర్ల టీ-20 విభాగం ఫైనల్లో దీప్తి 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించి దేశానికి ఎంతో పేరు తెచ్చింది. దీంతో దీప్తి పేరు మారుమోగిపోతుంది. దీప్తి పారాలింపిక్స్​లో పతకం సాధించడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

ఈ సందర్బంగా దీప్తి తల్లి జీవన్‌జీ ధనలక్ష్మి మాట్లాడుతూ..పుట్టినప్పుడు తల చాలా చిన్నగా, పెదవులు, ముక్కు కొంచెం అసాధారణంగా ఉన్నాయి. ఆమెను చూసిన ప్రతి గ్రామస్థుడు మరియు మా బంధువులు కొందరు దీప్తిని పిచ్చి అని కోతి అని పిలిచేవారు. ఆమెను అనాథాశ్రమానికి పంపమని చెబుతుండేవారు. ఈ రోజు, ఆమె సుదూర దేశంలో ప్రపంచ ఛాంపియన్‌గా మారడం చూస్తుంటే ఆమె నిజంగా ప్రత్యేకమైన అమ్మాయి అని రుజువు చేసిందని సంతోషం వ్యక్తం చేసింది. దీప్తి బయోగ్రఫీ చూసి అంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ..జయహో..దీప్తి అని..వైకల్యంతో బాధపడుతున్న వారందరు దీప్తి పట్టుదలను చూసి ముందుకు రావాలని..తమలోని టాలెంట్ ను బయటకు తీయాలని కోరుతున్నారు.

Read Also : Akhilesh vs Yogi : “బుల్డోజర్‌” వివాదం..అఖిలేష్ vs యోగి