Site icon HashtagU Telugu

T20 World Cup 2024: ఐపీఎల్ లో గాయపడితే ప్రపంచకప్ కష్టమే

T20 World Cup 2024

T20 World Cup 2024

T20 World Cup 2024: ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభం కానుంది. మొత్తం 10 జట్లు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నాయి. మార్చి 22న చెన్నై సూపర్ కింగ్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగే మ్యాచ్ ద్వారా ఈ సీజన్ మొదలుకానుంది. సుమారు రెండు నెలల పాటు జరిగే ఈ టోర్నమెంట్ భారత సెలెక్టర్లకు మరియు ఆటగాళ్లకు అగ్నిపరీక్షగా మారనుంది.

ఐపీఎల్ టోర్నీ తర్వాత భారత్ జూన్-జూలైలో అమెరికా మరియు వెస్టిండీస్‌లో టి20 ప్రపంచ కప్ ఆడాల్సి ఉంది. టి20 ప్రపంచకప్‌కు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కి రోహిత్ స్థానములో హార్దిక్ పాండ్య నాయకత్వం వహించనున్నాడు. ఇదిలా ఉండగా ఐపీఎల్ ముగిసిన వెంటనే హార్దిక్ మళ్ళీ రోహిత్ నాయకత్వంలో ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య రిలేషన్ సవ్యంగా సాగుతుందా లేదా అనేది చూడాలి. వీల్లిద్దరి బాండింగ్ టి20 ప్రపంచకప్ పై ప్రభావం పడుతుందంటున్నారు విశ్లేషకులు.

టీ20 ప్రపంచకప్‌ జట్టు నుంచి విరాట్‌ కోహ్లీని తొలగించే అవకాశం కనిపిస్తుంది. ఐపిఎల్‌లో విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తేనే బీసీసీఐ అతడిని సెలెక్ట్ చేసే అవకాశముందంటున్నారు. ఈ క్రమంలో బీసీసీఐ కావాలనే ముడిపెడుతుందన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కెప్టెన్ గా రోహిత్ సీనియర్ ప్లేయర్ గా కొనసాగుతాడు. మరోవైపు కోహ్లీని తప్పిస్తే ఆ స్థానంలో మరో యంగ్ ప్లేయర్ ని తీసుకోవాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీని సైడ్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఇక ఈ సీజన్ ఐపీఎల్ ద్వారా రిషబ్ పంత్ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇక్కడ చెలరేగితే పంత్ పొట్టి ప్రపంచకప్ కి సెలెక్ట్ అవుతాడు. మరోవైపు గాయం నుంచి కోలుకున్న తర్వాత పునరాగమనం చేయనున్న లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌పైనే అందరి దృష్టి పడింది. వాస్తవానికి రాహుల్ గత ఐపీఎల్‌లోనూ గాయపడ్డాడు. ఆ తర్వాత జట్టులోకి రావడానికి చాలా సమయం పట్టింది.

షమీ కూడా గాయంతో ఐపీఎల్ కి దూరమయ్యాడు. మరి ప్రపంచకప్ నాటికీ షమీ వస్తాడా అనేది చూడాలి, ఇక తాజాగా రోహిత్ కూడా గాయం బారీన పడ్డాడు. ధర్మశాలలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో రోహిత్ గాయపడ్డాడు. అయితే అదేం ప్రమాదకరంగా లేకపోయినప్పటికీ ఐపీఎల్ లో రోహిత్ ఆచితూచి ఆడాల్సి ఉంది. ఎందుకంటే ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రపంచకప్ మొదలవుతుంది. ఇండియన్స్ ప్రీమియర్ లీగ్లో గాయపడితే పరిస్థితి క్లిష్టంగా మారె అవకాశం ఉంది. ఏదేమైనా ఐపీఎల్ సెలెక్టర్లకు, ఆటగాళ్లకు అగ్నిపరీక్ష లాంటిందేనంటున్నారు సీనియర్ ఆటగాళ్లు.

Also Read: Telangana TET 2024: డీఎస్సీ కంటే ముందుగానే టెట్‌ నిర్వహణకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్