WTC Final Qualification: పుణె టెస్టులో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో ఓటమి తర్వాత మూడోసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో (WTC Final Qualification) ఫైనల్‌కు చేరుకోవాలనుకున్న టీమిండియా ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. న్యూజిలాండ్‌తో జరిగిన బెంగళూరు టెస్టు మ్యాచ్‌లోనూ టీమిండియా ఓడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు భారత్‌కు ఫైనల్ మార్గం కష్టతరంగా మారింది. టీమ్‌ఇండియా ఫైనల్‌కు చేరుకోవాలంటే తమ అత్యుత్తమ ఆటను ఆడాల్సి ఉంటుంది.
పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగుతోంది
ఇక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టిక గురించి మాట్లాడుకుంటే.. ప్రస్తుతం టీమ్ ఇండియా అగ్రస్థానంలో ఉంది. అయితే ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు కూడా పోటీలో ఉన్నాయి. ప్రస్తుతం టీమ్ ఇండియా 62.82 శాతం పాయింట్లను కలిగి ఉంది. అదే సమయంలో ఆస్ట్రేలియాకు 62.50 శాతం పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత పాయింట్ల పట్టికలో శ్రీలంక మూడో స్థానంలో, న్యూజిలాండ్ నాలుగో స్థానంలో, దక్షిణాఫ్రికా జట్టు ఐదో స్థానంలో నిలిచాయి.
Also Read: Telangana Battalion Constables: తెలంగాణ బెటాలియన్ కానిస్టేబుళ్ల సమస్య ఏమిటి? డీజీపీ ఏమన్నారంటే?
ఆస్ట్రేలియాలో విజయం సాధిస్తేనే ఫైనల్ ఆశలు
న్యూజిలాండ్‌పై వరుసగా రెండు పరాజయాల కారణంగా టీమ్‌ఇండియా ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ ఇండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు వెళ్లాలంటే.. కనీసం నాలుగు మ్యాచ్‌లైనా గెలవాల్సి ఉంటుంది. న్యూజిలాండ్‌తో టీమ్ ఇండియా ఇంకా మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. దీంతో పాటు ఆస్ట్రేలియాతో టీం ఇండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లో టీమిండియా కనీసం 3 మ్యాచ్‌లు గెలవాలి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టీమ్ ఇండియా ఫైనల్‌కు చేరుకోవడానికి ఈక్వేషన్ చాలా సులభం. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్‌కు చేరుకోవాలంటే ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో ఓడించాలి. ఒకవేళ టీమ్ ఇండియా ఈ పని చేయలేకపోతే ఇతర జట్లపై ఆధారపడాల్సి వస్తుంది. టీమ్ ఇండియా ఇటీవలి ఫామ్‌ను చూస్తుంటే ప్రస్తుతానికి ఇది చాలా కష్టంగా కనిపిస్తోంది.