Site icon HashtagU Telugu

India Won : ‘ఆసియా హాకీ ఛాంపియన్స్‌’ ట్రోఫీ మనదే.. జపాన్‌ను చిత్తుగా ఓడించిన భారత్

India Won

India Won

India Won : మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ సత్తా చాటింది. ఇండియా మహిళల టీమ్ అద్భుత ఆటతీరుకు జపాన్‌ టీమ్ బిత్తరపోయింది. 4-0 గోల్స్‌తో జపాన్‌ను భారత్  మట్టికరిపించి ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుపొందింది. సంగీత కుమారి (17వ నిమిషం), నేహా (46వ నిమిషం), లారెమ్‌సియామి (57వ), వందనా కటారియా (60వ) గోల్స్‌ సాధించి భారత్‌‌ను పాయింట్ల పట్టికలో ముందు నిలిపారు. జపాన్‌కు 3 వరుస పెనాల్టీ కార్నర్‌లు లభించినా.. వాటి నుంచి ఒక్క గోల్‌‌ను కూడా నమోదు చేయలేకపోయింది. దీనికి కారణం భారత మహిళల టీమ్ పటిష్టమైన డిఫెన్స్‌ అని చెప్పొచ్చు.

We’re now on WhatsApp. Click to Join.

మ్యాచ్ నాలుగో క్వార్టర్ ప్రారంభం కాగానే భారత్ వరుసగా మూడు పెనాల్టీ కార్నర్‌లను దక్కించుకుంది. నేహా దీప్ గోల్‌ చేసి భారత ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. 57వ నిమిషంలో లాల్‌రెమ్సియామి మరో పెనాల్టీ కార్నర్‌‌ను గోల్‌గా మలిచింది. దీంతో ఆధిక్యం మూడుకు పెరిగింది. చివర్లో వందన కూడా గోల్‌ చేయడంతో 4-0తో భారత మహిళల జట్టు ఆసియా హాకీ ఛాంపియన్స్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది. అంతకుముందు జరిగిన మ్యాచ్‌లో చైనా 2-1తో దక్షిణ కొరియాను ఓడించి మూడో స్థానాన్ని ఖాయం చేసుకుంది.గతంలోకి వెళితే.. తొలిసారిగా 2016లో సింగపూర్‌లో జరిగిన ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ సాధించింది. ఇది మనదేశ మహిళల హాకీ టీమ్‌ గెల్చుకున్న రెండో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ. ఇక భారత్ చేతిలో ఓడిపోయిన జపాన్..  2013, 2021లో రెండుసార్లు ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీని(India Won) గెల్చుకుంది.

Also Read: Telangana: తెలంగాణ తాలిబన్లను తరిమికొట్టాలి