పారిస్ ఒలింపిక్స్(Paris Olympics)లో భారత్‌కు దుమ్ముదులుపుతుంది. ఇప్పటికే పలు పతకాలను కైవసం చేసుకున్న భారత్ (India )..తాజాగా మరో పతకం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో స్పెయిన్(Spain)ను చిత్తు చేస్తూ వరుసగా రెండో పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటివరకు షూటింగ్‌లో 3 కాంస్య పతకాలు రాగా.. తాజాగా హాకీ జట్టు (Indian Hockey Team wins Bronze) మరో పతకం సాధించింది. సెమీఫైనల్స్‌లో తుది వరకు పోరాడి 2-3 తేడాతో జర్మనీపై ఓడిపోయిన భారత్ గురువారం కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్‌పై విజయం సాధించింది. దీంతో భారత క్రీడాభిమానులు సంతోషం వ్యక్తం చేస్తు హాకీ జట్టుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ కొట్టి భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు.
We’re now on WhatsApp. Click to Join.
రెండో సెట్ ప్రారంభంలో మొదటి గోల్ సాధించి స్పెయిన్1-0 అధిక్యంలోకి వెళ్లింది. రెండో సెట్ ఆఖరి నిమిషంలో భారత్ మొదటి గోల్ చేసి స్కోర్‌ను 1-1తో సమం చేసింది. ఇక మూడో సెట్ మొదట్లో ఆట 33వ నిమిషంలో మరో గోల్ చేయడంతో భారత్ 2-0 అధిక్యంలోకి వెళ్లింది. సింగ్ హరమన్‌ప్రీత్ (Harmanpreet Singh) భారత్ తరపున రెండు గోల్స్ చేశారు. మూడో సెట్ ముగిసే సమయానికి భారత్ 2-1 అధిక్యంలో నిలిచింది. నాల్గవ సెట్‌లో ఎవరికి పాయింట్ రాకపోవడంతో భారత్ 2-1తో విజయం సాధించి కాంస్య పతకం తన ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో భారత్‌కు వరుసగా రెండో ఒలింపిక్స్ పతకం రావడం విశేషం. టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత్‌కు కాంస్య పతకం దక్కిన సంగతి తెలిసిందే. దాదాపు 47 ఏళ్ల తర్వాత భారత హాకీ జట్టు వరుసగా 2 ఒలింపిక్స్‌లో పతకాలను దక్కించుకుంది.
వరుసగా రెండో కాంస్య పతకం గెలవడంతో భారత ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యారు. తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడిన ది గ్రేట్ ఆఫ్ వాల్ ఆప్ ఇండియా శ్రీజేష్ భావోద్వేగానికి గురయ్యాడు. విశ్వ క్రీడల్లో కాంస్య పతకంతో తన సుదీర్ఘ కెరీర్‌కు శ్రీజేష్ వీడ్కోలు పలికాడు. పతకం గెలిచిన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ సహా భారత ఆటగాళ్లు భావోద్వేగంతో కంటతడి పెట్టుకున్నారు. భారత జట్టు సంబరాలతోపాటు మైదానంలోనూ భారత్ మాతా కీ జై అన్న నినాదాలు మార్మోగాయి.
Read Also : Chaitu : ఫస్ట్ వైఫ్ ప్రపోజ్ చేసిన రోజే..సెకండ్ వైఫ్ తో ఎంగేజ్మెంట్..చైతు ఏమన్నా రివెంజా..!!