IND vs SL 3rd ODI: భారత్-శ్రీలంక మధ్య మూడో మరియు చివరి వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 7 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసింది. సిరీస్ సమం కావాలంటే భారత్ 249 పరుగులు చేయాల్సి ఉంది.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు పాతుమ్ నిస్సాంకా, అవిష్క ఫెర్నాండోల నుంచి శుభారంభం లభించింది. శ్రీలంక ఒక వికెట్ నష్టానికి 170 పరుగులు చేసింది. ఒకానొక సమయంలో శ్రీలంక జట్టు 280 పరుగుల మార్కును సులువుగా దాటుతుందని అనిపించినా.. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ ర్యాన్ పరాగ్‌ని బౌలింగ్‌కు ఆహ్వానించాడు. పరాగ్ మ్యాజిక్ తో లంకను కట్టడి చేసి 248 పరుగులకే పరిమితం చేశాడు.
తొలి వన్డే టై అయిన తర్వాత రెండో వన్డేలో శ్రీలంక విజయం సాధించింది. ప్రస్తుతం సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యంలో ఉంది. చివరి వన్డేలో విజయం సాధించి సమం చేయాలని భారత్ బరిలోకి దిగింది. అయితే లంక బౌలర్ల దూకుడికి టీమిండియా బ్యాటర్లు తలొగ్గారు. ఆరంభంలో రోహిత్ దూకుడుగా ఆడినప్పటికీ ఆ తర్వాత గిల్, కోహ్లీ, పంత్ ఇలా వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే అద్భుత బౌలింగ్ తో భారత బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్ కు చేర్చాడు. వెల్లలాగే బౌలింగ్ లో రోహిత్, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ వికెట్లు సమర్పించుకున్నారు. ఫలితంగా జట్టు స్కోర్ 100 సమయానికి 7 వికెట్లు కుప్పకూలాయి.
Also Read: IND vs SL 3rd ODI: కుప్పకూలిన భారత్, వణికించిన లంక బౌలర్లు