Site icon HashtagU Telugu

Ind Vs SA: సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా జట్టు ప్రకటన, 3 ఏళ్ల తర్వాత దినేష్ కార్తీక్ కు స్థానం.!!

Dinesh Karthik Kkr Imresizer

Dinesh Karthik Kkr Imresizer

IND vs SA T20 Team:దక్షిణాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును సెలక్టర్లు నేడు ప్రకటించారు. దక్షిణాఫ్రికాతో తలపడే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కేఎల్‌ రాహుల్‌కు అప్పగించారు. ఇది కాకుండా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్. షమీ వంటి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చింది. అయితే అనూహ్యంగా దినేష్ కార్తీక్ ను టీమిండియా జట్టులోకి తీసుకున్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత దినేశ్ మరోసారి జట్టులోకి వచ్చాడు. అతనితో పాటు సన్ రైజర్స్ తరపున ఆడుతున్న కాశ్మీరి ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ కూడా భారత టీ20 జట్టులో చోటు సంపాదించడం విశేషం.

దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌కు దినేష్ కార్తీక్ తిరిగి జట్టులోకి తిరిగి రావడం నిజంగా అద్భుతం అనే చెప్పాలి. ఈ వెటరన్ ఆటగాడు 2004లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా తొలిసారి అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. వికెట్ కీపర్, అలాగే బ్యాట్స్ మెన్ గా రాణించిన దినేష్ కార్తీక్, దాదాపు ధోనీ కన్నా ముందే టీమిండియాలో స్థానం సంపాదించాడు. అయితే అటు వికెట్ కీపర్, స్పెషలిస్ట్ బ్యాట్స్ మాన్ గా ధోనీ స్థిరపడటంతో, దినేష్ కార్తీక్ అవసరం టీమిండియాకు లేకుండా పోయింది. ధోనీ శకం నడిచినంత కాలం దినేష్ కార్తీక్ అడపదడపా టీమిండియాలోకి వస్తూ పోతుండే వాడు.

అయితే గత మూడేళ్లుగా దినేష్ కార్తీక్ ఖాళీగా ఉన్నాడు. అతను ఫిబ్రవరి 27, 2019న ఆస్ట్రేలియాతో తన చివరి T20 మ్యాచ్ ఆడాడు. అయితే ఐపీఎల్‌ 2022 సీజన్ లో మాత్రం కార్తీక్ ప్రదర్శన చాలా బాగుంది. ఆర్‌సీబీకి ఫినిషర్‌గా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడి 287 పరుగులు చేశాడు. ఈ సమయంలో, అతని సగటు 57.40 మరియు స్ట్రైక్ రేట్ 191.3గా నమోదైంది. అంతేకాదు అతను 9 సార్లు నాటౌట్ కూడా అయ్యాడు.

దినేష్ కార్తీక్ వరల్డ్ కప్ ఆడాలనుకుంటున్నాడు
ఐపీఎల్‌లో తన కల గురించి దినేష్ కార్తీక్ మాట్లాడుతూ, టీ 20 ప్రపంచ కప్ కోసం టీమ్ ఇండియాలో స్థానం సంపాదించుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. ఇందుకోసం తాను కష్టపడుతున్నానని. అంతే కాకుండా, ఐసిసి టోర్నమెంట్‌లో టీమిండియా మరోసారి గెలవాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.

దక్షిణాఫ్రికాతో T20I సిరీస్ కోసం భారత జట్టు:
KL రాహుల్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వైస్-కెప్టెన్ & WK), దినేష్ కార్తీక్ (WK), హార్దిక్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, అవేష్ ఖాన్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్.

Exit mobile version