Rain Threat: ఆసియా కప్ 2023లో ఆదివారం మరోసారి భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) జట్లు తలపడనున్నాయి. ఈసారి ఇరుజట్ల మధ్య సూపర్-4 మ్యాచ్ జరగనుంది. అంతకుముందు జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ రద్దయింది. ఈసారి రెండు జట్లూ కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో తలపడనున్నాయి. అంతకుముందు పల్లెకెలెలో ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అయితే ఈసారి ఇరుజట్ల మధ్య పోరుకి వర్షం ఆటంకం ఉందో లేదో తెలుసుకుందాం..!
కొలంబో వాతావరణం ఎలా ఉందంటే..?
Weather.com నివేదిక ప్రకారం కొలంబోలో 80-90 శాతం భారీ వర్షాలు (Rain Threat) కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట 100 శాతం వర్షం కురుస్తుందని అక్కడి నివేదికలు చెప్తున్నాయి. వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. రోజు గడిచేకొద్దీ వర్షం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నా, మ్యాచ్ జరిగే సమయానికి దాదాపు 80 శాతం వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయంలో గంటకు 15-20 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తేమ దాదాపు 90 శాతం ఉంటుంది. ఒకవేళ ఈ మ్యాచ్ కి కూడా వర్షం ఆటంకం కలిగిస్తే అభిమానులకు నిరాశ తప్పదనే చెప్పాలి.
Also Read: Anchor Suma : గ్జితి వేవ్స్ లో మనోహరి పేరుతో కొత్త కలెక్షన్స్ ని ప్రారంభించిన యాంకర్ సుమ..
రిజర్వ్ డే రోజు కూడా భారీ వర్షం..?
టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ కోసం రిజర్వ్ డే ఉంచబడిందని ఆసియా క్రికెట్ కౌన్సిల్ చెప్పింది. ACC ప్రకారం.. షెడ్యూల్ చేసిన రోజు వర్షం పడితే రిజర్వ్ డేలో మ్యాచ్ మునుపటి రోజు ఆట ఎక్కడ ఆగిందో అక్కడి నుండి ప్రారంభమవుతుంది. అయితే, రిజర్వ్ రోజున కూడా ఉరుములతో పాటు 80-90 శాతం వర్షాలు కురిసే అవకాశం ఉందని అక్కడి నివేదికలు చెప్తున్నాయి. ఆసియా కప్‌లో సూపర్-4 దశలో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య రిజర్వ్ డే ఉంచబడిన ఏకైక మ్యాచ్. రిజర్వ్ డే మరుసటి రోజు అంటే సోమవారం (సెప్టెంబర్ 11) ఉంటుంది. మరి ఈసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను అభిమానులు ఆస్వాదించగలరా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.