Site icon HashtagU Telugu

India vs Pakistan: ఆసియా కప్ విజయం తర్వాత మళ్లీ భారత్- పాకిస్తాన్ మ్యాచ్!

India vs Pakistan

India vs Pakistan

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మూడు మ్యాచ్‌లు జరిగాయి. ఆ మూడింటిలోనూ టీమ్ ఇండియా విజయం సాధించింది. చివరకు పాకిస్తాన్‌ను ఓడించి భారత్ ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఇప్పుడు నవంబర్ 2025లో మరోసారి భారత్-పాకిస్తాన్ మధ్య బ్లాక్‌బస్టర్ మ్యాచ్ జరగనుంది. ఈసారి రెండు దేశాల ‘ఏ’ జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ కూడా టీమ్ ఇండియా తరఫున ఆడనున్నాడు.

నవంబర్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్!

ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించే ACC రైజింగ్ స్టార్స్ T20 ఛాంపియన్‌షిప్ నవంబర్ 14, 2025 నుండి కతర్‌లోని దోహాలో ప్రారంభం కానుంది. గతంలో దీనిని ‘ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్’గా పిలిచేవారు. ఇప్పుడు ఈ యూత్ టోర్నమెంట్‌కు పేరు మార్చారు. రైజింగ్ స్టార్స్ T20 ఛాంపియన్‌షిప్‌లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తమ ‘ఏ’ జట్లను పంపనున్నాయి. యూఏఈ, ఒమన్, హాంకాంగ్ మాత్రం తమ ప్రధాన జట్లతో బరిలోకి దిగుతాయి. ముఖ్యంగా భారత్- పాకిస్తాన్ మధ్య నవంబర్ 16న మ్యాచ్ జరగనుంది.

వైభవ్ సూర్యవంశీ టీమ్ ఇండియాలో భాగం!

ఈ టోర్నమెంట్ కోసం టీమ్ ఇండియా ఎంపిక పూర్తయిందని, ఇందులో 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కిందని క్రిక్‌బజ్ నివేదించింది. బీసీసీఐ ఒకటి లేదా రెండు రోజుల్లో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు అండర్-19 జట్టు కోసం తన మెరుపు బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు ACC రైజింగ్ స్టార్స్ T20 ఛాంపియన్‌షిప్‌లోనూ తన సత్తా చాటడానికి అతనికి మంచి అవకాశం లభించింది.

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నిర్వహించనున్న ACC రైజింగ్ స్టార్స్ T20 ఛాంపియన్‌షిప్ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ యూత్ టోర్నమెంట్ నవంబర్ 14న కతర్‌లోని దోహాలో ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ‘ఏ’ జట్ల మధ్య మ్యాచ్ నవంబర్ 16న జరగనుంది.

Also Read: Telangana Women: సెమీఫైనల్ స్ఫూర్తితో తెలంగాణ మహిళలకు భవిత!

గ్రూప్-బిలో ఉన్న భారత్ తమ టోర్నమెంట్ ప్రయాణాన్ని నవంబర్ 14న యూఏఈతో జరిగే మ్యాచ్‌తో మొదలుపెట్టనుంది. షెడ్యూల్ ప్రకారం.. భారత్ తన రెండవ మ్యాచ్‌ను నవంబర్ 16న పాకిస్తాన్‌తో చివరి లీగ్ మ్యాచ్‌ను నవంబర్ 18న ఒమన్‌తో ఆడనుంది. గ్రూప్-ఏలో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, శ్రీలంక జట్లు పోటీపడనున్నాయి. ఈ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక తమ ‘ఏ’ జట్లతో బరిలోకి దిగుతుండగా యూఏఈ, ఒమన్, హాంకాంగ్ తమ ప్రధాన జట్లతో తలపడనున్నాయి.

ముఖ్య తేదీలు

Exit mobile version