IND Vs NZ T20 Match: నేడే ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో టీ20

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియా, న్యూజిలాండ్ (IND Vs NZ) మధ్య నేడు నిర్ణయాత్మకమైన మూడు టీ20 జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఒకటి గెలవగా, మరోదాంట్లో ఇండియా విజయం సాధించింది.నేడు జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికి సిరీస్ దక్కుతుంది.

  • Written By:
  • Updated On - February 1, 2023 / 09:09 AM IST

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఇండియా, న్యూజిలాండ్ (IND Vs NZ) మధ్య నేడు నిర్ణయాత్మకమైన మూడు టీ20 జరగనుంది. ఇప్పటికే జరిగిన రెండు టీ20ల్లో న్యూజిలాండ్ ఒకటి గెలవగా, మరోదాంట్లో ఇండియా విజయం సాధించింది. నేడు జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచిన వారికి సిరీస్ దక్కుతుంది. వన్డే సిరీస్ కోల్పోయిన న్యూజిలాండ్ ఈ సిరీస్‌ను దక్కించుకోవాలని చూస్తుండగా.. వన్డేతో పాటు టీ20 సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఇండియా భావిస్తోంది.

భారత్-న్యూజిలాండ్ మధ్య మూడు టీ20ల సిరీస్‌లో చివరి, నిర్ణయాత్మక మ్యాచ్ బుధవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్‌లో విజయం సాధించి, సిరీస్‌ను తమ పేరుగాంచుకునేందుకు ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 21 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. అదే సమయంలో రెండో మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లు మూడో మ్యాచ్‌లో విజయం సాధించేందుకు ఎదురు చూస్తున్నాయి.

Also Read: HCA : హైద‌రాబాద్ క్రికెట్ అసోషియేష‌న్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై సుప్రీంకు చేరిని నివేదిక‌

ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌ల్లోనూ న్యూజిలాండ్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. రాంచీ, లక్నోలోని పిచ్‌లు స్పిన్‌ బౌలర్లకు ఎంతగానో సహకరించాయి. అహ్మదాబాద్ బ్యాట్స్‌మెన్‌కు సహాయకారి పిచ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ స్పిన్నర్లకు పిచ్ కొంత సహాయపడవచ్చు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటల నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 6.30 గంటలకు టాస్‌ జరుగుతుంది.

భారత్ జట్టు (అంచనా): శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్/ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.

న్యూజిలాండ్ జట్టు (అంచనా): ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఇష్ సోధి, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, బ్లెయిర్ టిక్నర్.