Site icon HashtagU Telugu

Shubman Gill: ఇంగ్లాండ్‌తో మూడో వ‌న్డే.. సెంచ‌రీ సాధించిన గిల్‌, చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!

ICC Player Of Month Nominees

ICC Player Of Month Nominees

Shubman Gill: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై సెంచరీ సాధించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గిల్ చేసిన ఈ సెంచరీ భారత జట్టుకు శుభసూచకం. 95 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. గిల్ 102 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.

భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మూడో మ్యాచ్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. సచిన్ టెండూల్కర్‌ను వెన‌క్కి నెట్టి అహ్మదాబాద్ గడ్డపై పెద్ద అద్భుతం చేశాడు. ఆసియా గడ్డపై అత్యంత వేగంగా 16 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. విరాట్ కోహ్లీ ఇంగ్లండ్‌పై హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న భారీ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్‌ను విరాట్ కోహ్లి వెనక్కి నెట్టాడు.

Also Read: Cucumber: వేసవికాలంలో కీరదోసకాయ గొప్ప వరం.. ఆరోగ్యంతో పాటు అందం కూడా!

సచిన్ టెండూల్కర్‌ను వెన‌క్కి నెట్టాడు

ఆసియాలో అత్యంత వేగంగా 16 వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. కోహ్లి 340 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా, సచిన్ టెండూల్కర్ 353 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు. అయితే ఇప్పుడు సచిన్‌ను వెన‌క్కి నెట్టి కోహ్లీ మొద‌టి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో విరాట్ ఒకటి కాదు రెండు భారీ రికార్డులు సృష్టించాడు. ఇంగ్లండ్‌పై 4 వేల పరుగులు పూర్తి చేసిన భారత్‌ తరఫున తొలి ఆటగాడిగా కూడా నిలిచాడు. సచిన్ ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ క్రికెట్‌లో 3990 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌పై కోహ్లీ 4010 పరుగులు చేశాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ 52 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు.