Site icon HashtagU Telugu

India vs Bangladesh: బంగ్లాదేశ్‌పై చెల‌రేగిన ష‌మీ.. టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Bangladesh Tour

Bangladesh Tour

India vs Bangladesh: భారత్‌తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 228 పరుగులు చేసింది. ఇండియా vs బంగ్లాదేశ్ India vs Bangladesh) మ్యాచ్ దుబాయ్‌లో జరుగుతోంది. ఇందులో గెలవాలంటే టీమ్ ఇండియా 229 పరుగులు చేయాలి. బంగ్లాదేశ్ భారీ స్కోరు చేయలేకపోయింది. కానీ తౌహిద్ హృదయ్ సెంచరీ, జకీర్ అలీ అర్ధ సెంచరీ కారణంగా బంగ్లాదేశ్ గౌరవప్రదమైన స్కోరును చేరుకోగలిగింది. హృదయ్ 100 పరుగుల ఇన్నింగ్స్‌లో సెంచరీ ఆడాడు.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాకు భారీ షాక్ త‌గిలింది. తొలి ఓవర్‌లోనే మహ్మద్ షమీ సౌమ్య సర్కార్‌ను అవుట్ చేయగా, రెండో ఓవర్‌లో హర్షిత్ రాణా కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటోను అవుట్ చేశాడు. మెహదీ హసన్ 5 పరుగులు చేసి ఔట్ కాగా.. ముష్ఫికర్ రహీమ్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. 35 పరుగుల స్కోరుకే బంగ్లాదేశ్ జట్టులో సగం మంది పెవిలియన్ బాట పట్టిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత తౌహీద్ హృదయ్, జకీర్ అలీ 154 పరుగుల అద్భుత భాగస్వామ్యం నెలకొల్పారు. రిషద్ హుస్సేన్ 68 పరుగులు చేశాడు.

Also Read: Uber Auto : ఉబెర్‌లో ఆటో బుక్ చేసుకుంటారా ? కొత్త అప్‌డేట్ మీకోసమే

అక్షర్ పటేల్ తన స్పెల్ మొదటి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేయడం కనిపించింది. అతను రెండు వరుస బంతుల్లో తంజీద్ హసన్, ముష్ఫికర్ రహీమ్‌లను అవుట్ చేశాడు. కానీ రోహిత్ శర్మ జాకీర్ అలీ క్యాచ్‌ను జారవిడిచాడు. దీని కారణంగా అక్షర్ తన హ్యాట్రిక్ పూర్తి చేయలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా నుండి చాలా పేలవమైన ఫీల్డింగ్ క‌నిపించింది. రోహిత్‌తో పాటు హార్దిక్ పాండ్యా కూడా క్యాచ్‌ను వదదిలేశాడు. అదే సమయంలో KL రాహుల్ కూడా వికెట్ కీపింగ్‌లో విఫలమయ్యాడు. అతను ఒక ముఖ్యమైన స్టంపింగ్‌ను కూడా మిస్ చేశాడు.

భారత్ తరఫున మహ్మద్ షమీ బలంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు పడగొట్టాడు. అతను సౌమ్య సర్కార్, మెహదీ హసన్, జాకీర్ అలీ, తంజీమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్‌లను ఔట్ చేశాడు. ష‌మీతో పాటు హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు.