India vs Australia : ఆస్ట్రేలియాపై భారత మహిళా టీమ్ సంచలన విజయం

India vs Australia : ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్ట్‌ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్ టీమ్  మరో గ్రాండ్ విక్టరీని సాధించింది.

Published By: HashtagU Telugu Desk
India Vs Australia

India Vs Australia

India vs Australia : ఇంగ్లండ్‌పై చారిత్రక టెస్ట్‌ విజయంతో ఫుల్‌జోష్‌లో ఉన్న భారత మహిళల క్రికెట్ టీమ్  మరో గ్రాండ్ విక్టరీని సాధించింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్​లో ఘన విజయాన్ని కైవసం చేసుకుంది.  రెండు ఇన్నింగ్స్‌‌లలోనూ ఆస్ట్రేలియాను భారత మహిళల టీమ్ బాగా కట్టడి చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ తొలి ఇన్నింగ్స్​లో 219 పరుగులకు ఆలౌటైంది. ఆస్ట్రేలియా టీమ్‌లో ఓపెనర్ మూనీ (40), తాహిళ మెక్​ గ్రాత్ (50), కెప్టెన్ హీలీ (38) మాత్రమే రాణించారు. చివర్లో కిమ్ గార్త్ (28) ఫర్వాలేదు అనిపించింది. టీమిండియా తొలి ఇన్నింగ్స్​లో భారీగా 406 రన్స్ చేసి ఆలౌట్ అయింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు షఫాలీ వర్మ (40), స్మృతి మంధానా (74), రిచా ఘోశ్ (52), జెమిమా రోడ్రిగ్స్ (73), దీప్తి శర్మ (48), పూజా వస్ర్తకార్ (47) రన్స్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా(India vs Australia) 261 రన్స్‌కు ఆలౌట్ అయింది.  187 పరుగుల ఫాలో ఆన్​తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్​కు ఓపెనర్లు బెత్‌ మూనీ (33), లిచ్‌ఫీల్డ్‌ (18) మంచి ఆరంభం ఇచ్చారు. వీరి తర్వాత ఎలిస్‌ పెర్రీ (45), తహిళ మెక్​ గ్రాత్ (73), హీలీ (32) రాణించారు. మిగతావారెవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. 75 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు  బరిలోకి దిగిన  హర్మన్ ప్రీత్ కౌర్  సారథ్యంలోని టీమిండియా  18.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన 38 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచింది. రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 7 వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.

Also Read: WFI – Sports Ministry : డబ్ల్యుఎఫ్‌ఐ కొత్త కార్యవర్గం సస్పెండ్.. ఎందుకు ?

  Last Updated: 24 Dec 2023, 02:28 PM IST