India vs Australia : సిడ్నీ వేదికగా జరుగుతున్న ఇండియా, ఆస్ట్రేలియా ఐదో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. టెస్ట్ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 185 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా సైతం 181 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 4 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాను 200 పరుగులలోపు ఆలౌట్ చేయడం అనేది గత 70 ఏళ్లలో ఇది రెండోసారి మాత్రమే. అంటే సిడ్నీ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా టీమ్‌కు ఎంత మంచి ట్రాక్ రికార్డు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. గతంలోకి వెెళితే.. ఈ మైదానంలో ఇంగ్లండ్ టీమ్ 123 పరుగులకు ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా టీమ్(India vs Australia) 145 పరుగులకు ఆలౌట్ అయింది.
Also Read :Telangana BJP Chief : కౌన్ బనేగా తెలంగాణ బీజేపీ చీఫ్ .. రేసులో ఎనిమిది మంది
మరోవైపు మహ్మద్ సిరాజ్, నితీశ్ కుమార్ రెడ్డిలు భారత జట్టుకు ప్రధాన బలంగా మారారు. వారు అద్బుత ఆటతీరుతో టీమ్‌ను మున్ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ టెస్టులో నితీశ్ రెడ్డికి తొలి వికెట్ దక్కింది. అతడు ప్యాట్ కమిన్స్‌ను ఔట్ చేశాడు. నితీశ్ వేసిన బాల్ ప్యాట్ కమిన్స్ బ్యాట్ అంచును తాకుతూ వెళ్లి విరాట్ కొహ్లీ చేతికి చిక్కింది. ఆ సమయానికి ఆస్ట్రేలియా స్కోర్ 162/7గా ఉంది. ఆ వెంటనే మిచెల్ స్టార్క్ కూడా నితీశ్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. నితీశ్ వేసిన బంతిని మిచెల్ ఆడబోగా.. అది సెకండ్ స్లిప్‌లో కేఎల్ రాహుల్ చేతిలోకి వెళ్లింది. సిరాజ్ బౌలింగ్‌లో స్కాట్ బోలాండ్ (9) బౌల్డ్ అయ్యాడు. ప్రసిధ్ మూడు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాటింగ్‌ను మొదలుపెట్టింది. ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రంగంలోకి దిగారు.
మొత్తం మీద ఈ టెస్టులో బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్ అంశం భారత్‌ను ప్రధానంగా కలవరపరుస్తోంది. ఇవాళ మ్యాచ్ సందర్భంగా 31వ ఓవర్ తర్వాత వైద్య బృందంతో కలిసి బుమ్రా ఛేంజ్‌రూమ్ నుంచి బయటకు వెళ్లారు. అతడిని స్కాన్‌కు తీసుకెళ్లినట్లు తెలిసింది. దీంతో బుమ్రా స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా అభిమన్యు ఈశ్వరన్ వచ్చాడు.