IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో రికార్డు సృష్టించిన టీమిండియా..!

ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా (India) బౌలర్లు చెలరేగారు. కేవలం 188 పరుగులకే కంగారులను ఆలౌట్‌ చేశారు. దీంతో గతంలో ఇండియాపై ఉన్న రికార్డును బద్దలుకొట్టారు.

  • Written By:
  • Publish Date - March 18, 2023 / 07:24 AM IST

ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా (India) బౌలర్లు చెలరేగారు. కేవలం 188 పరుగులకే కంగారులను ఆలౌట్‌ చేశారు. దీంతో గతంలో ఇండియాపై ఉన్న రికార్డును బద్దలుకొట్టారు. 2001లో భారత్‌ 35.5 ఓవర్లలో 181 పరుగులకే ఆస్ట్రేలియాను ఆలౌట్‌ చేసి.. అత్యంత తక్కువ ఓవర్లలో ఆలౌట్‌ చేసిన రికార్డును నెలకొల్పింది. తాజాగా.. ఈ రికార్డును టీమిండియా బ్రేక్‌ చేస్తూ 35.4 ఓవర్లకే ఆస్ట్రేలియాని ఆలౌట్‌ చేసింది.

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ జరిగింది. టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత జట్టు వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకునేందుకు సిద్ధమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత్ ముందు 189 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని భారత్ 39.5 ఓవర్లలోనే సాధించింది. ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 35.4 ఓవర్లలో 188 పరుగులకే కుప్పకూలింది. కంగారూల తరఫున మిచెల్ మార్ష్ అత్యధిక ఇన్నింగ్స్‌లో 81 పరుగులు చేశాడు.

Also Read: RRR: నాటు నాటు పాటకు స్టెప్పులేసిన విరాట్ కోహ్లీ.. అబ్బో మాములుగా చేయలేదుగా?

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 39.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. KL రాహుల్ ఫామ్ లోకి వచ్చాడు. 91 బంతుల్లో 75 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అతనితో పాటు రవీంద్ర జడేజా కూడా 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి మధ్య ఆరో వికెట్‌కు 108 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొంది. ఈ విజయంతో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు తదుపరి వన్డే ఆదివారం విశాఖపట్నంలో జరగనుంది.