Site icon HashtagU Telugu

India Reaches Final: అండ‌ర్‌- 19 ప్ర‌పంచ‌క‌ప్‌.. ఫైన‌ల్‌కు చేరిన టీమిండియా

India Reaches Final

India Reaches Final

India Reaches Final: బ్యూమాస్ ఓవల్‌లో శుక్రవారం జరిగిన ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025 రెండో సెమీఫైనల్‌లో భారత జట్టు (India Reaches Final) 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. 114 పరుగుల లక్ష్యాన్ని 1 వికెట్ నష్టానికి ఛేదించిన భారత జట్టు వరుసగా రెండోసారి ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఇప్పుడు ఫిబ్రవరి 2న టైటిల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ టోర్నీ తొలి ఎడిషన్‌లో భారత్‌ విజయం సాధించింది. భారత్ విజయంతో టోర్నీలో ఇంగ్లండ్ జట్టు ప్రయాణం ముగియగా, టీమిండియా ఫైనల్స్‌లో చోటు ఖాయం చేసుకుంది. మహిళల అండర్-19 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

Also Read: MLC elections : రాత్రికి రాత్రే అన్నీ జ‌రిగిపోతాయ‌ని చెప్ప‌ట్లేదు: సీఎం చంద్రబాబు

ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున క‌మలిని (56 నాటౌట్‌), త్రిష (35) ప‌రుగులు చేసి జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2025లో భారత్ ఫైనల్‌కు చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత అండర్-19 జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జి కమలిని టీమ్ ఇండియా త‌ర‌పున‌ అజేయ అర్ధ సెంచరీ చేసింది. 50 బంతుల్లో 56 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడింది. కమలిని ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి.

తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఈ సమయంలో ఓపెనర్ ద్వినా పెర్రిన్ 45 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. 40 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదింది. ట్రేడీ జాన్సన్ 25 బంతులు ఎదుర్కొని 30 పరుగులు చేసింది. 3 ఫోర్లు, 1 సిక్స్ కొట్టింది. భారత్ తరఫున పరుణిక, వైష్ణవి శర్మ చెరో 3 వికెట్లు తీయ‌గా.. ఆయుషి శుక్లా 2 వికెట్లు ద‌క్కించుకుంది.

ఇంగ్లండ్ ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించేందుకు వ‌చ్చిన టీమిండియా కేవలం 15 ఓవర్లలోనే విజయం సాధించింది. జి కమలిని, జి త్రిష ఓపెనింగ్ వ‌చ్చారు. ఈ సమయంలో త్రిష 29 బంతులు ఎదుర్కొని 35 పరుగులు చేసింది. కాగా కమలిని అర్ధ సెంచరీ చేసింది. 50 బంతుల్లో అజేయంగా 56 పరుగులు సాధించింది. కమలిని ఈ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు ఉన్నాయి. సానికా చాల్కే అజేయంగా 11 పరుగులు చేసింది.