Site icon HashtagU Telugu

Cricket World Cup 2025: మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ క‌ప్‌.. భార‌త్ త‌ల‌ప‌డే జ‌ట్టు ఏదీ?

Cricket World Cup 2025

Safeimagekit Screenshot2025 10 2410035

Cricket World Cup 2025: ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో (Cricket World Cup 2025) నిన్న (అక్టోబర్ 23) టీమ్ ఇండియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో టీమ్ ఇండియా గెలిచి సెమీ-ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు డూ ఆర్ డై లాంటిది. టీమ్ ఇండియా కంటే ముందు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు ఇప్పటికే సెమీస్‌లోకి ప్రవేశించాయి. న్యూజిలాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా నాలుగో సెమీ-ఫైనలిస్ట్ జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో టీమ్ ఇండియా నాలుగో స్థానంలో ఉంది.

సెమీ-ఫైనల్‌లో టీమ్ ఇండియా ఏ జట్టుతో తలపడుతుంది?

ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో నాలుగు సెమీ-ఫైనలిస్ట్ జట్లు ఖరారయ్యాయి. టీమ్ ఇండియా చేతిలో ఓడి న్యూజిలాండ్ టోర్నమెంట్ నుండి నిష్క్రమించింది. ఇప్పుడు సెమీ-ఫైనల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌత్ ఆఫ్రికా, టీమ్ ఇండియా తలపడనున్నాయి. అయితే ఈ జట్లలో ఒక్కొక్కరికి లీగ్ దశలో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా తలపడతాయి. ఇంగ్లాండ్‌ న్యూజిలాండ్‌తో ఆడుతుంది. ఇక టీమ్ ఇండియా తన చివరి లీగ్ మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడనుంది.

టీమ్ ఇండియా బంగ్లాదేశ్‌ను ఓడించినప్పటికీ పాయింట్ల పట్టికలో దాని స్థానంపై ఎలాంటి ప్రభావం ఉండదు. టీమ్ ఇండియా అప్పటికీ నాలుగో స్థానంలోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో సెమీ-ఫైనల్‌లో టీమ్ ఇండియా నెం.1 స్థానంలో ఉండే జట్టుతోనే తలపడుతుంది.

Also Read: Kurnool Bus Accident: క‌ర్నూలు బ‌స్సు ప్ర‌మాదం.. ఒకే కుటుంబంలో న‌లుగురు మృతి

టాప్-3 జట్ల స్థానాల్లో మార్పు ఉంటుందా?

గ్రూప్ దశ చివరి మ్యాచ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న జట్ల స్థానాల్లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా జట్టు మొదటి స్థానంలో ఉంది. కానీ చివరి మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా జట్టు కంగారూ జట్టును ఓడిస్తే ఆస్ట్రేలియా రెండో స్థానానికి పడిపోతుంది. సౌత్ ఆఫ్రికా మొదటి స్థానంలోకి వస్తుంది. ఒకవేళ ఆస్ట్రేలియానే సౌత్ ఆఫ్రికాను ఓడిస్తే.. అది మొదటి స్థానంలోనే కొనసాగుతుంది. ఇంగ్లాండ్ ప్రస్తుతానికి మూడో స్థానంలో ఉంది. అది న్యూజిలాండ్‌ను ఓడిస్తే దాని పాయింట్లు 11 అవుతాయి. దానికి రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. అయితే సౌత్ ఆఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను ఓడించగలిగితేనే ఇంగ్లాండ్ రెండో స్థానానికి రాగలుగుతుంది.

టీమ్ ఇండియా సెమీ-ఫైనల్‌లో పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానంలో ఉన్న జట్టుతో (అంటే ప్రస్తుతానికి ఆస్ట్రేలియా, లేదా ఆస్ట్రేలియాను ఓడిస్తే సౌత్ ఆఫ్రికా) తలపడే అవకాశం ఉంది. సమాచారం ప్రకారం.. టీమ్ ఇండియా సెమీ-ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 29న గౌహతిలో జరగనుంది. అయితే సెమీ-ఫైనల్ 2, అంటే 2వ స్థానం vs 3వ స్థానం మధ్య మ్యాచ్ అక్టోబర్ 30న ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగనుంది.

Exit mobile version