India Playing 11: బుధవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా (India Playing 11) ఇంగ్లండ్‌తో తలపడనుంది. సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ కీలక మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందన్నదే తెలియాల్సి ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కారణంగా చాలా మంది కీలక ఆటగాళ్లు జట్టుకు దూరంగా ఉండగా, టీ20 సిరీస్ కోసం భారత్ యువ ఆటగాళ్లను రంగంలోకి దించింది.
కోల్‌కతాలోని వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే ఇంగ్లాండ్‌తో జరిగే ఈ మ్యాచ్‌లో భారత్ ఇద్దరు స్పిన్నర్లను మాత్రమే బరిలోకి దింపే అవకాశం ఉంది. ఎందుకంటే సాయంత్రం మంచు కారణంగా మ్యాచ్ ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇద్దరు స్పిన్నర్లుగా వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి బరిలోకి దిగనున్నారు. ఇటువంటి పరిస్థితిలో వాషింగ్టన్ సుందర్ తన స్థానాన్ని కోల్పోవచ్చు.
Also Read: Trump Tower Hyderabad : త్వరలో హైదరాబాద్‌కు ట్రంప్ కుమారులు.. కారణం ఇదే
ఈ ఆటగాడు అరంగేట్రం చేయవచ్చు
గతేడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసిన 21 ఏళ్ల యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా కూడా ఈ జట్టులోకి అరంగేట్రం చేసే అవకాశం ఉంది. మ్యాచ్‌కు ముందు జరిగిన విలేకరుల సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్వయంగా మాట్లాడుతూ.. కోల్‌కతాలో సాయంత్రం మంచును దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ కోసం సన్నాహాలు ప్రారంభించినట్లు చెప్పారు.
మహ్మద్ షమీ ఆడటం ఖాయం
ఇంగ్లండ్‌తో జరిగే తొలి టీ20 మ్యాచ్‌లో మహ్మద్ షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లో భాగమని సూర్యకుమార్ యాదవ్ కూడా దాదాపు ధృవీకరించాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత షమీ తొలిసారి భారత్ తరపున ఆడనున్నాడు. షమీ గురించి సూర్య మాట్లాడుతూ.. మా జట్టులో అనుభవజ్ఞుడైన బౌలర్‌ను కలిగి ఉండటం ఎల్లప్పుడూ మంచిదే. షమీ ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం తర్వాత తిరిగి వస్తున్నాడు. షమీ జట్టులోకి రావడం నిజంగా సంతోషిస్తున్నాను. ఆయన ప్రయాణాన్ని చూశాను. నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో తన బౌలింగ్, కోలుకోవడంపై ఎలా దృష్టి సారించాడనేది నాకు తెలుసు. మైదానంలో అతన్ని చూడటం ఆనందంగా ఉంది. బౌలింగ్ కూడా బాగా చేశాడు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.
తొలి మ్యాచ్‌కి భారత్ ప్లేయింగ్ ఎలెవన్
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.