Site icon HashtagU Telugu

India: జూనియర్ హాకీ ప్రపంచ కప్‌.. భారత్ అద్భుత విజయం!

India

India

India: తొమ్మిది సంవత్సరాల తర్వాత జూనియర్ హాకీ ప్రపంచ కప్ (Junior Hockey World Cup 2025) ఆతిథ్యం భారత గడ్డపై జరుగుతోంది. ఈ జూనియర్ హాకీ ప్రపంచ కప్‌లో భారత జట్టు (India) నవంబర్ 28న తన ప్రచారాన్ని ప్రారంభించింది. తమిళనాడులోని మేయర్ రాధాకృష్ణన్ హాకీ స్టేడియంలో భారత్- చిలీ మధ్య ఈ మ్యాచ్ జరిగింది.

భారత్ ప్రారంభంలో అద్భుతమైన ఆటతీరు కనబరిచి మొదటి 10 నిమిషాలలోనే ఆధిపత్యం చెలాయించింది. ఆ తర్వాత భారత జట్టు వెనుతిరిగి చూడలేదు. చిలీ జట్టుకు గట్టి పోటీ ఇచ్చింది. భారత్ తరఫున దిల్‌జీత్ సింగ్ అద్భుతమైన ఆటను ప్రదర్శించాడు. చివరకు భారత్ 7-0 తేడాతో ఘన విజయం సాధించింది.

Also Read: Aadhaar: ఆధార్ కార్డుపై ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం!

భారత్ అద్భుతమైన విజయం

మొదటి క్వార్టర్: మొదటి క్వార్టర్‌లో భారత్- చిలీ ఆటగాళ్లు ఒకరిపై ఒకరు ఒత్తిడి తెచ్చినా ఇరు జట్లు ఒక్క గోల్ కూడా చేయలేకపోయాయి.

రెండవ క్వార్టర్: అయితే రెండవ క్వార్టర్‌లో భారత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా 1 గోల్ చేసి ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత 21వ నిమిషంలో రోసన్ కుజూర్ మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 2-0కి పెరిగింది. భారత జట్టు తమ అద్భుత ప్రదర్శనను కొనసాగించి కేవలం 4 నిమిషాల తర్వాత అంటే 25వ నిమిషంలో దిల్‌రాజ్ మరో గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం 3-0కి పెరిగింది. మొదటి అర్ధభాగం ముగిసేసరికి భారత్ 3-0 ఆధిక్యంలో ఉంది.

మూడవ, నాల్గవ క్వార్టర్లు: 34వ నిమిషంలో దిల్‌రాజ్ సింగ్ సాయంతో భారత్ నాలుగో గోల్ చేసి ప్రత్యర్థి ఆటగాళ్లను ఆశ్చర్యపరిచింది. నాల్గవ గోల్ చేసిన కొద్ది సెకన్లకే భారత్ ఐదవ గోల్ చేసి చిలీ జట్టును పూర్తిగా కోలుకోకుండా చేసింది. ఆ తర్వాత నాల్గవ క్వార్టర్‌లో భారత్ మరో రెండు గోల్స్ చేసి మొత్తం ఆధిక్యాన్ని 7-0కి పెంచింది. భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో చిలీ జట్టును పూర్తిగా వెనక్కి నెట్టారు.

Exit mobile version