India World Cup Squad: వన్డే వరల్డ్‌కప్.. భారత జట్టు ప్రకటన.. బీసీసీఐ ప్రకటించిన జట్టు ఇదే..!

ప్రపంచకప్‌కు భారత జట్టు (India World Cup Squad)ను బీసీసీఐ ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి.

  • Written By:
  • Updated On - September 5, 2023 / 02:30 PM IST

ప్రపంచకప్‌కు భారత జట్టు (India World Cup Squad)ను బీసీసీఐ ప్రకటించింది. జట్టులో 15 మంది ఆటగాళ్ల పేర్లు ఉన్నాయి. భారత్ లో అక్టోబర్ 5 నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్-2023కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 సభ్యులతో జట్టుని బీసీసీఐ వెల్లడించింది. భారత జట్టు: రోహిత్ శర్మ(C), పాండ్యా, విరాట్ కోహ్లీ, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, KL రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.

Also Read: World Cup India Squad: నేడు భారత ప్రపంచకప్‌ జట్టు ప్రకటన..?

ప్రపంచకప్ జట్టులో తిలక్ వర్మ, సంజూ శాంసన్‌లకు భారత్ చోటు కల్పించలేదు. 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టులో ప్రసిద్ధ్ కృష్ణకు కూడా చోటు దక్కలేదు. 15 మంది ఆటగాళ్లతో కూడిన భారత జట్టులో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ కి కూడా చోటు దక్కలేదు.

ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించిన తర్వాత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ KL రాహుల్ ఫిట్‌నెస్ అప్‌డేట్‌ను విడుదల చేశారు. రాహుల్ నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్‌పై వర్కౌట్స్ చేస్తున్నాడని, రాహుల్ ప్రపంచకప్‌కు పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని అగార్కర్ చెప్పాడు.

2023 వన్డే ప్రపంచకప్‌కు భారత జట్టును మంగళవారం మధ్యాహ్నం 1:30 గంటలకు సమావేశం అనంతరం 15 మందితో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. ODI ప్రపంచ కప్ 2023కి భారతదేశం ఆతిథ్యమిస్తుంది. అక్టోబర్ 5 నుండి ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ నవంబర్ 19 న జరుగుతుంది. సెప్టెంబర్ 5 నాటికి మొత్తం 10 జట్లు ICC ప్రపంచ కప్ కోసం తమ జట్టును ప్రకటించవలసి ఉందని, చివరి రోజున అంటే మంగళవారం బీసీసీఐ టీమిండియా జట్టుని ప్రకటించింది.

ప్రపంచకప్‌కు టీమిండియా జట్టు బాగానే కనిపిస్తోంది. జట్టులో ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లకు చోటు దక్కింది. ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జట్టుతో ఉన్నారు. జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లకు చోటు కల్పించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టులో నలుగురు ఫాస్ట్ బౌలర్లకు చోటు దక్కగా, ఒక స్పిన్నర్ ఉన్నాడు. ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించినప్పటికీ జట్టులో మార్పు చేసుకునే అవకాశం ఉంది. జట్టులో మార్పుల కోసం ఐసీసీ సెప్టెంబర్ 28 వరకు సమయం ఇచ్చింది. 15 మంది ఆటగాళ్లతో కూడిన తుది జాబితాను సెప్టెంబర్ 28న బోర్డు సమర్పించనుంది.

15 మంది సభ్యులతో కూడిన జట్టులో చోటు దక్కించుకోని ఆటగాళ్ల బాధ తనకు అర్థమవుతోందని రోహిత్ శర్మ అన్నాడు. ఈ పరిస్థితిని రోహిత్ శర్మ స్వయంగా ఎదుర్కొన్నాడు. 2011 ప్రపంచకప్‌లో రోహిత్ శర్మకు టీమిండియాలో చోటు దక్కలేదు. చివరి క్షణంలో రోహిత్ శర్మ స్థానంలో పీయూష్ చావ్లా ఎంపికయ్యాడు.