Site icon HashtagU Telugu

India Maharajas: దంచికొట్టిన ఊతప్ప, గంభీర్.. 75 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన ఇండియా మహారాజాస్‌..!

LLC 2023

Resizeimagesize (1280 X 720) (4)

లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టోర్నీలో ఇండియా మహారాజాస్‌ (India Maharajas)కి తొలి విజయం దక్కింది. మహారాజాస్, ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో అదిరిపోయే విజయంతో బోణీ కొట్టింది. లెజెండ్ లీగ్ క్రికెట్ 2023 మ్యాచ్‌లో ఆసియా లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ జట్టు 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. రాబిన్ ఉతప్ప, గౌతమ్ గంభీర్ కారణం 159 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకి తొలి విజయం అందించారు. 225 స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఉతప్ప ఈ మ్యాచ్‌లో 39 బంతుల్లో 88 పరుగులు చేశాడు. అదే సమయంలో గంభీర్ బ్యాట్ నుంచి 36 బంతుల్లో 61 పరుగులు వచ్చాయి.

మిస్బా-ఉల్-హక్ ఆసియా లయన్స్‌కు నాయకత్వం వహించాడు. టాస్ గెలిచిన ఇండియా మహారాజాస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఉపుల్ తరంగ ఓపెనింగ్ బ్యాటింగ్‌లో 48 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. రెండో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ 27 బంతుల్లో 32 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరి మధ్య తొలి వికెట్‌కు 73 పరుగుల ముఖ్యమైన భాగస్వామ్యం ఏర్పడింది.

Also Read: Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఘన విజయం.. ప్లేఆఫ్స్‌కు అర్హత..!

దీని తర్వాత ఆసియా లయన్స్ ఇన్నింగ్స్ కాస్త తడబడింది. మహ్మద్ హఫీజ్ రెండు పరుగులు చేసి ఔటవగా, ముస్బా ఉల్ హక్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. 15 పరుగులు చేసిన తర్వాత ఆడుతున్న అజ్గర్ ఆఫ్ఘన్‌ను సురేష్ రైనా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేశాడు. చివర్లో అబ్దుల్ రజాక్ 17 బంతుల్లో 27 పరుగులు చేశాడు. దీంతో ఆసియా లయన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. సురేష్ రైనాకు రెండు వికెట్లు దక్కాయి. వీరితో పాటు హర్భజన్ సింగ్, ప్రవీణ్ తాంబే, స్టువర్ట్ బిన్నీలకు ఒక్కో వికెట్ దక్కింది. లక్ష్యాన్ని ఛేదించే సమయంలో భారత మహారాజాస్‌కు కేవలం 12.3 ఓవర్లలోనే భారత జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. రాబిన్ ఉతప్ప 11 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. అదే సమయంలో గంభీర్ బ్యాట్ నుంచి 12 ఫోర్లు వచ్చాయి.