Team India No1 : వన్డేల్లో నెంబర్ వన్ గా టీమిండియా… అన్ని ఫార్మాట్లలోనూ మనమే టాప్

ఈ విజయంతో పాక్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ గా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది

Published By: HashtagU Telugu Desk
India create history ahead of ODI World Cup 2023

India create history ahead of ODI World Cup 2023

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాను తొలి వన్డేలో చిత్తు చేసిన టీమిండియా వన్డే ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని (India is now No 1 team ) కైవసం చేసుకుంది. ఈ విజయంతో పాక్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ లో నిలిచింది. దీంతో మూడు ఫార్మాట్లలోనూ (All three formats) నెంబర్ వన్ గా నిలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. ఆసియాకప్ గెలిచిన తర్వాత రెండో స్థానంలో ఉండి రేటింగ్ పాయింట్లను మరింత పెంచుకున్న భారత్ అగ్రస్థానం సాధిస్తుందని చాలా అంచనా వేశారు. ప్రస్తుతం ఆసీస్ తో సిరీస్ గెలిస్తే ప్రపంచకప్ లో నెంబర్ వన్ ర్యాంకుతోనే ఆడుతుంది.

ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్ లో భారత్ (Indian cricket team) 116 పాయింట్లతో టాప్ ప్లేస్ లో ఉండగా…115 పాయింట్లతో పాక్ రెండో స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 111 పాయింట్లతో మూడో స్ఖానంలోనూ, 106 పాయింట్లతో సౌతాఫ్రికా , 105 పాయింట్లతో ఇంగ్లాండ్ నాలుగు,ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. కాగా మూడు ఫార్మాట్లలోనూ నెంబర్ వన్ ర్యాంకులో నిలిచిన రెండు జట్టు టీమిండియానే. గతంలో సౌతాఫ్రికా 2012లో మూడు ఫార్మాట్లలోనూ అగ్రస్థానం సాధించింది. కాగా ప్రస్తుతం నెంబర్ వన్ ర్యాంకు రేసులో పాకిస్థాన్ కూడా ఉంది. మిగిలిన రెండు వన్డేల్లో ఆస్ట్రేలియా గెలిస్తే మళ్లీ పాక్ అగ్రస్థానానికి చేరుకుంటుంది. ఇదిలా ఉంటే మొహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్ సునాయాసంగా విజయం సాధించింది.

Read Also : Telangana : బీఆర్ఎస్ కు మరో షాక్.. మైనంపల్లి హన్మంతరావు రాజీనామా

మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా (Australia) 276 పరుగులకు ఆలౌటైంది. భారత సీనియర్ పేసర్ మహ్మద్ షమీ 5 వికెట్లతో ఆసీస్ ను దెబ్బకొట్టాడు. ఛేజింగ్ లో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ , శుభ్ మన్ గిల్ అర్థసెంచరీలతో మెరుపు ఆరంభాన్నివ్వగా… తర్వాత కెఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ , సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో టీమిండియా లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. కెఎల్ రాహుల్ 58, సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులతో రాణించారు. దీంతో భారత్ 48.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది.

  Last Updated: 22 Sep 2023, 11:23 PM IST