T20 World Cup: సూపర్-8లో భారత్ రికార్డ్ ఇదే

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ కు దాదాపుగా తెరపడింది. పెద్ద జట్లలో కొన్ని ఇంటిదారి పడితే... అంచనాలు లేని చిన్నజట్లలో కొన్ని ముందంజ వేశాయి. ఈ నెల 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు షురూ కానున్నాయి.

T20 World Cup: టీ ట్వంటీ వరల్డ్ కప్ లో లీగ్ స్టేజ్ కు దాదాపుగా తెరపడింది. పెద్ద జట్లలో కొన్ని ఇంటిదారి పడితే… అంచనాలు లేని చిన్నజట్లలో కొన్ని ముందంజ వేశాయి. ఈ నెల 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు షురూ కానున్నాయి. కరేబియన్ దీవులు వేదికగా టోర్నీలో మిగిలిన మ్యాచ్ లు జరగనుండగా.. భారత్ ఫ్లోరిడా నుంచి విండీస్ కు బయలుదేరింది. ఈ నేపథ్యంలో సూపర్ 8 స్టేజ్ లో టీమిండియా రికార్డు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. గతంలో జరిగిన వరల్డ్ కప్ పలు ఎడిషన్లలో సూపర్ 12, సూపర్ 10 స్టేజ్ లు నిర్వహించారు. ఈ సారి సూపర్ 8 పేరుతో రెండో రౌండ్ జరగబోతోంది. నిజానికి సూపర్ 8 స్టేజ్ లో భారత్ కు అంత మంచి రికార్డు లేదు.

దాదాపు ప్రతీ ఎడిషన్ లో ఈ స్టేజ్ కు సంబంధించి కాస్త ఇబ్బందికర పరిస్థితులనే భారత్ ఎదుర్కొంది. ఇప్పటి వరకూ సూపర్ 8 స్టేజ్ లో 12 మ్యాచ్ లు ఆడిన టీమిండియా కేవలం 4 మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది. 8 మ్యాచ్ లలో పరాజయం పాలైంది. అంటే విజయాల శాతం 33.33 మాత్రమే. 2009, 2010 ఎడిషన్ లలో ఆడిన మూడు మ్యాచ్ లల్లోనూ ఓడిపోగా… 2012లో మాత్రం రెండింటిలో గెలిచి, ఒక మ్యాచ్ ఓడింది. 2012 ఎడిషన్ లో ఆసీస్ చేతిలో ఓడినప్పటకీ తర్వాత పుంజుకుని పాకిస్తాన్. సౌతాఫ్రికా జట్లపై విజయాలు సాధించింది. అయితే ఈ సారి మాత్రం టైటిల్ ఫేవరెట్ గా ఉన్న రోహిత్ సేన ఖచ్చితంగా మెరుగ్గా రాణిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. సూపర్ 8లో భారత్ వరుసగా ఆప్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ , ఆస్ట్రేలియా జట్లతో తలపడబోతోంది.

Also Read: Rushikonda : రుషికొండ ఫై ఉన్నవి ప్రభుత్వ భవనాలే – వైసీపీ ట్వీట్