Site icon HashtagU Telugu

WFI President: వినేష్ ఫోగట్‌కు శుభవార్త.. WFI కీల‌క ప్రకటన..!

Vinesh Phogat Contest From Julana

Vinesh Phogat Contest From Julana

WFI President: పారిస్ ఒలింపిక్స్ 2024లో మహిళల 50 కిలోల రెజ్లింగ్ ఫైనల్‌కు ముందు భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ అనర్హత వేటు పడింది. ఆ తర్వాత రజత పతకానికి సంబంధించి వినేష్ స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ కోర్టులో అప్పీల్ చేసింది. వినేష్ అప్పీల్‌పై CSA నిర్ణయం ఇంకా వెల్లడి కానప్పటికీ.. భారతీయ రెజ్లింగ్ ఫెడరేషన్ నుండి వినేష్‌కు గొప్ప వార్త వచ్చింది. అయితే వినేష్ ఫోగ‌ట్ 50 కిలోల విభాగంలో 100 గ్రాముల బ‌రువు పెర‌గ‌డంతో ఆమెను పోటీకి అన‌ర్హురాలుగా ప్ర‌క‌టించిన విష‌యం మ‌న‌కు తెలిసిందే.

WFI ఉపాధ్యక్షుడు జై ప్రకాష్ చౌదరి పెద్ద ప్రకటన

కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (CAS) రెజ్లర్ వినేష్ ఫోగట్ అప్పీల్‌పై తీర్పు ఇవ్వడానికి గడువును పొడిగించడంపై WFI వైస్ ప్రెసిడెంట్ (WFI President) జై ప్రకాష్ చౌదరి ఇలా జరిగి ఉండకూడదు అని అన్నారు. కానీ వినేష్‌కి అనుకూలంగా ఏదో ఒకటి వస్తుందని మా నమ్మకం. ఇందులో కొన్ని శక్తులు ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెకి పతకం వస్తుందని ప్రెసిడెంట్ తెలిపారు.

Also Read: Varalakshmi Vratham: పెళ్లి కానీ ఆడపిల్లలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!

ఈ విషయంలో వినేష్ కోచింగ్ సిబ్బంది తప్పు చేశారని జయప్రకాశ్ అభిప్రాయపడ్డారు. బరువును ఎలా స్థిరంగా ఉంచుకోవాలో తనిఖీ చేయడం కోచ్ పని. ఇక ఈ కేసుపై పెద్ద పెద్ద లాయర్లు పోరాడుతున్న తీరు, దేశ ప్రధాని దృష్టికి తీసుకెళ్లిన తీరు చూస్తుంటే ఆగస్ట్ 16న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు.

ఆగస్టు 16న నిర్ణయం వెలువడనుంది

వినేష్ ఫోగట్ రజత పతకం కేసుపై CAS ఆగస్టు 13న తీర్పు ఇవ్వాల్సి ఉండగా, నిన్న CAS దానిని ఆగస్టు 16 వరకు పొడిగించింది. దీని తర్వాత ఇప్పుడు కోట్లాది మంది భారతీయ అభిమానులు ఆగస్ట్ 16 కోసం ఎదురుచూస్తున్నారు. వినేష్‌కు అనుకూలంగా నిర్ణయం వచ్చి రజత పతకం దక్కుతుందని భావిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.