IND vs WI: మొదటి వన్డేలో భారత్ ఘన విజయం

వెస్టిండీస్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది.టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే నేలకూలింది

IND vs WI: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. మూడు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది.టీమిండియా బౌలర్ల దెబ్బకు మొదటి వన్డేలో అతిథ్య వెస్టిండీస్ జట్టు 114 పరుగులకే నేలకూలింది. టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా విండీస్ బ్యాటర్లను విలవిల్లాడించారు. .టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్‌ను ఆరంభంలో పేసర్లు దెబ్బకొట్టారు. ఆ తర్వాత స్పిన్నర్లు చుట్టేశారు. దీంతో 50 ఓవర్ల మ్యాచ్‌ను కాస్త టీ20 మ్యాచ్‌లా మార్చేశారు.

టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. కైల్ మేయర్స్‎ను ఔట్ చేసి భారత్‌కు మొదటి వికెట్‌ను హార్దిక్ పాండ్యా అందించాడు. తర్వాత అథనేజ్, కింగ్‌‌లు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీలు చిక్కినప్పుడు బౌండరీలు సాధించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించే ప్రయత్నం చేశారు. ఈక్రమంలోనే అథనేజ్‌ను ముకేష్ కుమార్ 8వ ఓవర్‌లో ఔట్ చేయడంతో వెస్టిండీస్ 45 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత ఓవర్లోనే బ్రాండన్ కింగ్ శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వెనుదిరగడంతో విండీస్ 45 పరుగుల వద్ద 3 వికెట్ కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో పడింది.

కాసేపు హోప్, హెట్‌మయేర్‌ నిలకడగా ఆడారు. ఆ వెంటనే హెట్‌మేయర్ ను 11 పరుగుల వద్ద క్లీన్ బౌల్డ్ చేయడం ద్వారా జడ్డూ ఈ పాట్నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. దీంతో 88 పరుగుల వద్ద కరేబియన్లు నాలుగో వికెట్ కోల్పోయారు. ఇక అక్కడినుంచి విండీస్ ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. ఒంటరి పోరాటం చేసిన కెప్టెన్‌ హోప్‌ క్రీజులో కుదురుకుపోయి 43 పరుగులు చేయడంతో వెస్టిండీస్ ఈ మాత్రం స్కోరు అయినా చేయగలిగింది. 45 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన హోప్‌‌ని అవుట్ చేసిన కుల్దీప్ యాదవ్, అదే ఓవర్‌లో జేడన్ సీల్స్‌ని డకౌట్ చేయడంతో వెస్టిండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. మొత్తానికి విండీస్ ఇన్సింగ్స్ టీ20 లా ముగిసింది. (IND vs WI)

స్వల్ప లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లుగా ఇషాన్ కిషన్‌తో బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్ 7పరుగులు మాత్రమే చేయగలిగాడు. నాలుగో ఓవర్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం సూర్య కుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చి ఎక్కువసేపు నిలువలేకపోయాడు. 19 పరుగులు చేసి మోతీ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ ధాటిగా ఆడాడు. 46 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 52 పరుగులతో జట్టుకు మంచి స్కోర్ సాధించి పెట్టాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యా, రనౌట్ అయ్యాడు. అయితే టీమిండియా కూడా పేలవ ప్రదర్శనతో 97 పరుగులకే సగం టీమ్ పెవిలియన్‌కి చేరింది. ఆ సమయంలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు కెప్టెన్ రోహిత్ శర్మ.. రోహిత్ , జడేజా భాగస్వామ్యంతో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ 12, జడేజా 16 పరుగులతో నాటౌట్ గా నిలిచి జట్టుని గెలిపించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం జూలై 29 న జరగనుంది.

Also Read: Niger Coup : నైగర్‌ అధికార పార్టీ ఆఫీసుకు నిప్పు.. సైనిక తిరుగుబాటుతో ఉద్రిక్తత