ఫైన‌ల్లోకి భార‌త్‌.. 7 ప‌రుగుల‌తో ఇంగ్లాండ్‌పై ఘ‌న విజ‌యం!

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది.

Published By: HashtagU Telugu Desk
India Beat England

India Beat England

India Beat England: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Also Read: 23 ఏళ్ల తర్వాత రోహిత్-కోహ్లీ లేకుండా సెమీఫైనల్ ఆడిన టీమిండియా!

లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ జట్టు త‌డ‌బ‌డింది. ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జాకబ్ బెథెల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో పోరాడినప్పటికీ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులే చేయగలిగింది. తద్వారా భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లోకి ప్రవేశించింది.

టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 పరుగుల ఇన్నింగ్స్ ఆడారు. ఇందులో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత శివమ్ దూబే కూడా 25 బంతుల్లో 43 పరుగులు బాదారు. అనంతరం హార్దిక్ పాండ్యా 12 బంతుల్లో 27 పరుగులు చేయగా, తిలక్ వర్మ 7 బంతుల్లో 21 పరుగులు జోడించారు. దీనివల్లే టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తరఫున విల్ జాక్స్, ఆదిల్ రషీద్ చెరో 2 వికెట్లు తీశారు.

  Last Updated: 05 Mar 2026, 11:05 PM IST