IND W vs SA W: మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు వర్షం ముప్పు!

భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య టీ20ఐ ఫార్మాట్‌లో హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే టీమ్ ఇండియా ఆధిపత్యం కనిపిస్తుంది. రెండు జట్లు టీ20ఐలలో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు తలపడ్డాయి.

Published By: HashtagU Telugu Desk
IND W vs SA W

IND W vs SA W

IND W vs SA W: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ నేడు (నవంబర్ 2) భారత్, దక్షిణాఫ్రికా మధ్య (IND W vs SA W) జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరగబోయే ఈ తుది పోరులో తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీని గెలవాలని రెండు జట్లూ తలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టి ఈ టైటిల్ పోరుపైనే ఉంది. కానీ ఈ మహా పోరుపై వర్షం ముప్పు పొంచి ఉంది.

ఫైనల్ మ్యాచ్ సమయంలో నవీ ముంబైలో భారీ వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అక్కడ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ రద్దయ్యే ప్రమాదం ఉంది. అయితే అంతకుముందు మ్యాచ్‌ను పూర్తి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌ను 20-20 ఓవర్ల వరకు కూడా కుదించే అవకాశం ఉంది. వర్షం కారణంగా ఫైనల్ 20-20 ఓవర్లకు కుదించబడితే ఎవరు గెలుస్తారని అభిమానులు తెలుసుకోవాలనుకుంటున్నారు. టీ20ఐ గణాంకాలు ఏం చెబుతున్నాయో చూద్దాం.

Also Read: Mexico Explosion: మెక్సికో సూపర్ మార్కెట్లో భారీ పేలుడు

మహిళల ప్రపంచ కప్ ఫైనల్‌పై వర్షం ముప్పు

మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌పై వర్షం ప్రమాదం ఉంది. గత కొన్ని రోజులుగా నవీ ముంబైలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. మ్యాచ్ ప్రారంభానికి ముందు కూడా నవీ ముంబైలో తేలికపాటి వర్షం కురిసింది. ఎక్యువెదర్ ప్రకారం.. నవంబర్ 2, ఆదివారం నవీ ముంబైలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 15 శాతం వర్షం పడే అవకాశం ఉంది. సాయంత్రం 5 గంటల తర్వాత వర్షం వచ్చే అవకాశం 30% వరకు ఉంది. ఇది అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఫైనల్ కోసం నవంబర్ 3న రిజర్వ్ డే కూడా ఉంది. అయినప్పటికీ మ్యాచ్ నిర్ణీత రోజు (నవంబర్ 2)నే పూర్తి కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. అలాంటప్పుడు ఓవర్లను తగ్గించి కనీసం 20-20 ఓవర్ల మ్యాచ్‌గా నిర్వహించే అవకాశం ఉంది.

IND W vs SA W మధ్య T20I రికార్డులో ఎవరికి బలం?

భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య టీ20ఐ ఫార్మాట్‌లో హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే టీమ్ ఇండియా ఆధిపత్యం కనిపిస్తుంది. రెండు జట్లు టీ20ఐలలో ఇప్పటివరకు మొత్తం 19 సార్లు తలపడ్డాయి. వీటిలో 10 మ్యాచ్‌లలో భారత జట్టు విజయం సాధించగా.. ఆఫ్రికా జట్టు 6 మ్యాచ్‌లు గెలిచింది. మరో 3 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా ముగిశాయి. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. గణాంకాల ప్రకారం.. దక్షిణాఫ్రికాపై భారత జట్టుదే పైచేయిగా ఉంది.

చరిత్ర సృష్టించేందుకు టీమ్ ఇండియాకు అవకాశం

భారత జట్టు 2005, 2017 తర్వాత మూడోసారి వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఈసారి ఫైనల్ సొంత గడ్డపై అంటే ముంబైలో జరుగుతుండటంతో కప్ గెలిచే ఆశలు మరింత పెరిగాయి. మహిళల వన్డే ప్రపంచ కప్‌లో ఆతిథ్య జట్టు ఫైనల్ ఆడటం ఇది ఐదోసారి. ఇంతకుముందు ఆస్ట్రేలియా (1988), ఇంగ్లాండ్ (1993, 2017), న్యూజిలాండ్ (2000) ఇలా ఆడాయి.

హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా ఈ ప్రపంచ కప్‌లో 7 మ్యాచ్‌లలో 3 గెలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. సెమీస్‌లో బలమైన ఆస్ట్రేలియాను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్రపంచ కప్‌ను గెలిచి చరిత్ర సృష్టించే సువర్ణావకాశం టీమ్ ఇండియా ముందు ఉంది.

  Last Updated: 02 Nov 2025, 03:24 PM IST