Site icon HashtagU Telugu

IND vs SL 1st T20: తొలి టి20లో సూర్య విధ్వంసం, 26 బంతుల్లో 58 పరుగులు

Ind Vs Sl 1st T20

Ind Vs Sl 1st T20

IND vs SL 1st T20: శ్రీలంకతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో హార్దిక్ పాండ్యా రికార్డును సూర్య బ్రేక్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ 16 పరుగులతో టీ20లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా నిలిచాడు.

శ్రీలంకతో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసి 26 బంతుల్లో 58 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు.  టీ20లో సూర్య 20వ హాఫ్ సెంచరీ సాధించాడు. కెప్టెన్‌గా మూడో అర్ధ సెంచరీ సాధించాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత కెప్టెన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి వికెట్‌కు తొలి పవర్‌ప్లేలో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ జోడీ 74 పరుగులు జోడించడంతో భారత్‌కు గొప్ప ఆరంభం లభించింది. శుభ్‌మన్ గిల్ 16 బంతుల్లో 34 పరుగులు చేసి దిల్షాన్ మధుశంక చేతిలో ఔట్ అయ్యాడు.

యశస్వి జైస్వాల్ 21 బంతుల్లో 40 పరుగులు చేసి వనిందు హసరంగా వేసిన బంతికి కుసాల్ మెండిస్ చేతిలో స్టంపౌట్ అయ్యాడు. మూడో స్థానంలో ఉన్న కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో ఔటయ్యాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా 33 బంతుల్లో 49 పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అయితే హార్దిక్ పాండ్యా 10 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేశాడు. మతిషా పతిరానా బౌలింగ్‌లో హార్దిక్, పంత్ ఇద్దరూ ఔటయ్యారు.మతిషా పతిరనా 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రియాన్ పరాగ్ ని ఎల్‌బీడబ్ల్యూతో పెవిలియన్ కి పంపాడు. రింకు సింగ్ 1 పరుగు మాత్రమే చేయగలిగాడు. అక్షర్ పటేల్ 5 బంతుల్లో అజేయంగా 10 పరుగులు చేశాడు.

శ్రీలంక బౌలింగ్‌లో మతిషా పతిరనా నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. దిల్షాన్ మధుశంక, అసిత ఫెర్నాండో, వనిందు హసరంగా తలో వికెట్ తీశారు. హసరంగ తన కోటా ఓవర్లలో 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

Also Read: TTD పదవులన్నీ కమ్మ కులానికేనా..? విజయసాయి రెడ్డి