IND vs PAK: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో ప్రస్తుతం సూపర్-8 పోరు ఉత్కంఠభరితంగా సాగుతోంది. సూపర్-8లోని టాప్-4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. సెమీఫైనల్ విజేతల మధ్య మార్చి 8న ఫైనల్ పోరు జరగనుంది. గ్రూప్ స్టేజ్‌లో భారత్, పాకిస్థాన్‌లు ఒకే గ్రూప్‌లో ఉండగా కొలంబోలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది.
అయితే సూపర్-8లో ఈ రెండు జట్లు వేర్వేరు గ్రూపుల్లో ఉన్నాయి. కాబట్టి ఈ రౌండ్‌లో తలపడే అవకాశం లేదు. కానీ క్రికెట్ అభిమానులకు శుభవార్త ఏంటంటే.. భారత్- పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఇంకా ఉంది. ఆ సమీకరణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు ఇలా సాధ్యం..
సూపర్-8లో భారత్ గ్రూప్-1లో, పాకిస్థాన్ గ్రూప్-2లో ఉన్నాయి. కాబట్టి సెమీఫైనల్ కంటే ముందు ఈ రెండు జట్లు తలపడలేవు. భారత్-పాక్ ఫైనల్‌లో తలపడాలంటే రెండు జట్లు తమ తమ గ్రూపుల్లో ఒకే స్థానంలో ఉండి సెమీఫైనల్‌కు అర్హత సాధించాలి.
Also Read: ఆర్టీసీ కార్మికులకు గుడ్‌న్యూస్ .. అదనంగా మరో 2 లక్షలు మంజూరు ..!
సమీకరణం 1: ఒకవేళ భారత్ గ్రూప్-1 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిస్తే, పాకిస్థాన్ కూడా గ్రూప్-2లో మొదటి స్థానంలోనే ఉండి సెమీస్‌కు రావాలి.
సమీకరణం 2: ఒకవేళ భారత్ గ్రూప్-1లో రెండో స్థానంలో నిలిస్తే, పాకిస్థాన్ కూడా గ్రూప్-2లో రెండో స్థానంలోనే నిలవాలి. ఇలా జరిగినప్పుడు రెండు జట్లు సెమీఫైనల్‌లో వేర్వేరు జట్లతో తలపడతాయి. ఆ మ్యాచ్‌ల్లో విజయం సాధిస్తే ఫైనల్‌లో ముఖాముఖి తలపడే అవకాశం ఉంటుంది.
ఐసీసీ నియమాలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సెమీఫైనల్‌లో గ్రూప్-1 టాపర్, గ్రూప్-2 రన్నరప్‌తో తలపడాలి. ఒకవేళ భారత్, పాకిస్థాన్‌లు తమ గ్రూపుల్లో వేర్వేరు స్థానాల్లో (ఒకటి టాప్, మరొకటి సెకండ్) నిలిస్తే అవి సెమీఫైనల్‌లోనే తలపడాల్సి వస్తుంది. ఫైనల్‌లో తలపడాలంటే మాత్రం అవి వేర్వేరు సెమీఫైనల్స్ ఆడి గెలవాల్సి ఉంటుంది.
జట్ల ప్రస్తుత పరిస్థితి
భారత్: సౌతాఫ్రికాతో జరిగిన మొదటి సూపర్-8 మ్యాచ్‌లో భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీనివల్ల నెట్ రన్ రేట్ పడిపోయింది. ఇప్పుడు జింబాబ్వే, వెస్టిండీస్‌లపై భారీ తేడాతో గెలవాల్సి ఉంది.
పాకిస్థాన్: పాక్ ఆడిన మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. సెమీస్ రేసులో ఉండాలంటే వారు ఇంగ్లాండ్, శ్రీలంక వంటి బలమైన జట్లను ఓడించాల్సి ఉంటుంది.
సెమీఫైనల్, ఫైనల్ షెడ్యూల్
- మొదటి సెమీఫైనల్: మార్చి 4 (వేదిక ఇంకా ఖరారు కాలేదు)
- రెండో సెమీఫైనల్: మార్చి 5, ముంబై (వాంఖడే స్టేడియం)
- ఫైనల్: మార్చి 8 (వేదిక ఇంకా ఖరారు కాలేదు)
