IND vs ENG: నేడు భార‌త్‌-ఇంగ్లండ్ జ‌ట్ల మ‌ధ్య రెండో టెస్టు.. టీమిండియా జ‌ట్టు ఇదే..!?

భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది.

  • Written By:
  • Updated On - February 2, 2024 / 07:38 AM IST

IND vs ENG: భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేటి నుంచి విశాఖపట్నంలో రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడిన భారత జట్టు సిరీస్‌లో 0-1తో వెనుకంజలో ఉంది. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు రెండో మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే టీమ్‌ఇండియాకు అత్యుత్తమ ప్లేయింగ్‌ లెవన్‌ అవసరం. కాబట్టి భారతదేశం ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండ‌నుందో తెలుసుకుందాం.

అయితే ప్లేయింగ్ ఎలెవన్ తెలుసుకునే ముందు విరాట్ కోహ్లి, మహమ్మద్ షమీ, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లాంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్ల గైర్హాజరీలో భారత జట్టు రెండో మ్యాచ్ ఆడనుందని మ‌న‌కు తెలిసిందే.

రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం ఖ‌రారు

రీప్లేస్‌మెంట్స్‌గా రెండో టెస్టుకు టీమిండియాలో చేరిన రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్‌ల టెస్టు అరంగేట్రం దాదాపు ఖాయమైంది. మూడో స్థానంలో ఆడుతున్న శుభ్‌మన్ గిల్ స్థానంలో పాటిదార్ ఆడవచ్చు. గత కొంత కాలంగా టెస్టుల్లో పేలవ ఫామ్‌తో గిల్ ఇబ్బంది పడుతున్నాడు. హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో నాలుగో నంబర్‌లో ఆడిన రాహుల్ లేకపోవడంతో సర్ఫరాజ్ ఖాన్‌కు అదే నంబర్‌లో అవకాశం దక్కే అవకాశం ఉంది.

Also Read: IND vs ENG 2nd Test: రెండు టెస్టులో టీమిండియాకు విజయావకాశాలు

తొలి టెస్టులో జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ సహా ఇద్దరు పేసర్లతో భారత జట్టు మైదానంలోకి వచ్చినా సిరాజ్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. అతనికి ఒక్క వికెట్ కూడా దక్కలేదు. తొలి మ్యాచ్‌లో పిచ్ స్పిన్నర్లకు ఎంతగానో సహకరించింది. ఇలాంటి పరిస్థితిలో రోహిత్ శర్మ నలుగురు స్పిన్నర్లను జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశం ఉంది. ఇదే జ‌రిగితే సిరాజ్ బెంచ్‌కే ప‌రిమితం కావాల్సి ఉంటుంది. సిరాజ్‌ స్థానంలో కుల్‌దీప్‌ యాదవ్‌ బరిలోకి దిగవచ్చు. తొలి టెస్టులో ఇంగ్లండ్‌ ఒకే ఒక్క పేసర్‌తో ఆడింది. తొలి టెస్టులో గాయపడిన రవీంద్ర జడేజా స్థానంలో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను ప్లేయింగ్ ఎలెవన్‌లో రోహిత్ శర్మ జ‌ట్టులోకి తీసుకోవ‌చ్చు.

We’re now on WhatsApp : Click to Join

టీమిండియా జ‌ట్టు (అంచ‌నా)

రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, రజత్ పాటిదార్, సర్ఫరాజ్ ఖాన్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, వాషింగ్టన్ సుందర్, ఆర్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.