Shivam Dube: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుతంగా రాణించింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకోగా భారత బ్యాటర్లు ఆ నిర్ణయాన్ని తప్పు అని నిరూపించారు. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో స్టార్ బ్యాటర్ శివమ్ దూబే మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ మరోసారి రనౌట్ అయ్యారు. ఈ టోర్నీలో దూబే ఇలా రనౌట్ అవ్వడం ఇది మూడోసారి. సరిగ్గా 19 ఏళ్ల క్రితం మహేంద్ర సింగ్ ధోనీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
ఈ టోర్నీలో మూడోసారి రనౌట్ అయిన శివమ్ దూబే
ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కీలక మార్పు చేస్తూ శివమ్ దూబేను నంబర్ 4 స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది. దాన్ని సద్వినియోగం చేసుకున్న దూబే, 25 బంతుల్లో 43 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఇందులో 1 ఫోర్, 4 సిక్సర్లు ఉన్నాయి. అయితే 43 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హార్దిక్ పాండ్యా చేసిన పొరపాటు వల్ల శివమ్ దూబే రనౌట్ అయ్యాడు. టీ20 ప్రపంచకప్ ఒకే ఎడిషన్‌లో మూడుసార్లు రనౌట్ అయిన రెండో భారత ఆటగాడిగా దూబే నిలిచాడు. అంతకుముందు 2007 టీ20 ప్రపంచకప్‌లో అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూడా మూడుసార్లు రనౌట్ అయ్యాడు. ఈ టోర్నీలో అంతకుముందు రింకూ సింగ్ వల్ల కూడా దూబే రనౌట్ అయ్యాడు.
Also Read: ఇంగ్లాండ్‌తో సెమీ ఫైనల్ పోరు.. చరిత్ర సృష్టించిన భారత్!
అదరగొట్టిన భారత బ్యాటర్లు
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 9 పరుగులకే వెనుదిరిగారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లందరూ కీలక సహకారం అందించారు. వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ 42 బంతుల్లో 89 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా, ఇషాన్ కిషన్ 18 బంతుల్లో 39 పరుగులు చేశారు. చివర్లో హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ చిన్నపాటి కానీ కీలకమైన ఇన్నింగ్స్‌లతో తోడవడంతో భారత్ 20 ఓవర్లలో 253 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది.
