Site icon HashtagU Telugu

IND vs ENG: 39 సంవ‌త్స‌రాల త‌ర్వాత భారత్, ఇంగ్లండ్ స్కోర్లు సమానం!

Highest Run Chase

Highest Run Chase

IND vs ENG: భారత క్రికెట్ జట్టుతో ఇంగ్లాండ్ జ‌ట్టుకు (IND vs ENG) ఇలాంటి ఘ‌ట‌న మూడవసారి జరిగింది. ఒక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్ తర్వాత ఏ జట్టూ ఆధిక్యంలో లేకుండా.. రెండు జట్ల స్కోరు సమానంగా ఉంది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో జరుగుతున్న భారత్ vs ఇంగ్లండ్ మూడవ టెస్ట్‌లో ఇదే జరిగింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని భారత జట్టు 387 పరుగులకు ఆలౌట్ అయింది. అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ జట్టు కూడా 387 పరుగులే చేసింది.

బెన్ స్టోక్స్ లార్డ్స్‌లో జరుగుతున్న టెస్ట్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రోజు 251 పరుగులు వచ్చాయి. రెండవ రోజు జో రూట్ తన శతకం (104) పూర్తి చేశాడు. కానీ వెంటనే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. జామీ స్మిత్ చివర్లో 51 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 387కి చేర్చాడు.

భారత్, ఇంగ్లండ్ స్కోరు సమానం

భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కెఎల్ రాహుల్ శతకం (100), కరుణ్ నాయర్ (40), రిషభ్ పంత్ (74), రవీంద్ర జడేజా (72) ముఖ్యమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. చివరి జోడీ సిరాజ్- వాషింగ్టన్ సుందర్ స్కోరు సమానం చేయగానే ఔట‌య్యారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 9వ సారి మాత్రమే ఒక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్ల స్కోరు సమానంగా ఉంది. ఇటువంటి సంఘటన చివరిసారి 2015లో లీడ్స్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిచింది. ఇలాంటి మునుపటి 8 మ్యాచ్‌లలో 6 డ్రాగా ముగిశాయి. అందులో 2 మ్యాచ్‌లు భారత జట్టుకు సంబంధించినవి ఉన్నాయి.

Also Read: Teenmaar Mallanna Office: తీన్మార్ మ‌ల్ల‌న్న కార్యాల‌యంపై దాడి.. తుపాకీతో గాల్లోకి కాల్పులు?

భారత్‌తో మూడవసారి ఇలా జరిగింది

భారత క్రికెట్ జట్టుతో మొదటి ఇన్నింగ్స్‌లో స్కోరు సమానంగా ఉన్న సంఘటన ఇది మూడవసారి. గతంలో జరిగిన రెండు టెస్ట్‌లు డ్రాగా ముగిశాయి. భారత్‌తో ఇలాంటి సంఘటన చివరిసారి 1986లో జరిగింది.

మొదటి ఇన్నింగ్స్‌లో సమాన స్కోరు ఉన్న మ్యాచ్‌ల జాబితా

క్రికెట్ మక్కాగా పిలవబడే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో చరిత్రలో మొదటిసారిగా ఒక టెస్ట్ మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో రెండు జట్ల స్కోరు సమానంగా ఉంది. భారత్ vs ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ గురించి చెప్పాలంటే మొదటి టెస్ట్‌ను ఇంగ్లండ్, రెండవ టెస్ట్‌ను భారత్ గెలిచింది.

Exit mobile version