Site icon HashtagU Telugu

Weather Report: నేటి నుండి భారత్- ఇంగ్లాండ్ మూడో టెస్ట్‌.. వ‌ర్షం ముప్పు ఉందా?

Weather Report

Weather Report

Weather Report: భారత్- ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడవ మ్యాచ్ నేటి నుండి లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్‌లో (Weather Report) ప్రారంభం కానుంది. ‘క్రికెట్ మక్కా’గా పిలవబడే ఈ చారిత్రక మైదానంలో రెండు జట్లు సిరీస్‌లో ఆధిక్యం సాధించే ఉద్దేశంతో ఒకరినొకరు ఎదుర్కోనున్నాయి. ఈ సిరీస్‌లోని మొదటి టెస్ట్‌ను ఇంగ్లాండ్ గెలుచుకుంది. అయితే బర్మింగ్‌హామ్‌లో జరిగిన రెండవ మ్యాచ్‌లో భారత్ 336 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మూడవ మ్యాచ్ ఉత్కంఠ రెట్టింపు అయింది. కానీ ఈ మధ్యలో ఒక ప్రశ్న తలెత్తుతోంది. టెస్ట్ మ్యాచ్‌కు వ‌ర్షం ముప్పు ఉందా? అనేది ఇప్పుడు అభిమానుల మ‌దిలో మొద‌లైంది.

లార్డ్స్ వాతావరణం ఎలా ఉంటుంది?

అభిమానులకు శుభవార్త ఏమిటంటే.. లార్డ్స్ టెస్ట్ సమయంలో వర్షం పడే అవకాశం ఎక్కువగా లేదు. మ్యాచ్ ఐదు రోజుల పాటు వాతావరణం వేడిగా, పొడిగా ఉండవచ్చు. పగటిపూట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండ‌వ‌చ్చు. రాత్రి సమయంలో అది 16 డిగ్రీల వరకు పడిపోవచ్చు. గాలి వేగం గంటకు 10 కి.మీ. వరకు ఉంటుందని అంచనా. అయితే తేమ 84 శాతం వరకు ఉండవచ్చు. మొత్తంగా వాతావరణం క్రికెట్ ఆడేందుకు అనుకూలంగా ఉంది. మొదటి రోజు వర్షం ఎలాంటి పెద్ద ప్రమాదం లేకుండా ఉంటుంది.

Also Read: ED : బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసు..29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ

పిచ్ ప‌రిస్థితి ఏంటి?

లార్డ్స్ పిచ్ ప్రాథమిక చిత్రాలు చూస్తే ఆకుపచ్చ గడ్డి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సారి క్యూరేటర్ పిచ్‌పై అదనపు నీటిని పోయలేదు. చిత్రాల్లో పిచ్‌పై కొంత గడ్డి కూడా కనిపిస్తోంది. ఇది మొదటి రెండు రోజులు వేగవంతమైన బౌలర్లకు పిచ్ నుండి మంచి సహాయం లభిస్తుందని సూచిస్తోంది. అయితే ఇంగ్లాండ్ బాజ్‌బాల్ వ్యూహాన్ని గమనిస్తే మ్యాచ్ నెమ్మదిగా సాగుతుందని ఖచ్చితంగా చెప్పలేము. ఇక్కడ కూడా దూకుడైన ఆటను చూడవచ్చు.

భారత్ ప్లేయింగ్ 11 అంచ‌నా

ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11