Site icon HashtagU Telugu

IND vs BAN: బంగ్లాదేశ్ టెస్ట్ గెలిస్తే టీమిండియా నంబర్ వన్

IND vs BAN

IND vs BAN

IND vs BAN: శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన రోహిత్ సేన బంగ్లాదేశ్ (bangladesh) తో జరిగే రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ద్వారా తిరిగి పుంజుకోవాలని చూస్తుంది. ఇరుజట్ల మధ్య ప్టెంబర్ 19 నుంచి 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ టీమ్ ఇండియాకు చాలా ప్రత్యేకమనే చెప్పాలి.ఇందుకోసం రోహిత్ శర్మ నేతృత్వంలో టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. తొలి టెస్టులో బంగ్లాదేశ్‌ను చిత్తు చేస్తే భారత్ దక్షిణాఫ్రికాతో సమానంగా నిలుస్తుంది. దీంతో పాటు మరికొన్ని రికార్డులను కూడా ఖాతాలో వేసుకుంటుంది.

టెస్టు క్రికెట్ చరిత్రలో దక్షిణాఫ్రికా (south africa) జట్టు ఇప్పటి వరకు 179 మ్యాచ్‌లు గెలిచి అత్యధిక మ్యాచ్‌లు గెలిచి నాలుగో స్థానంలో ఉంది.ఇప్పటి వరకు 178 టెస్టు మ్యాచుల్లో టీమిండియా విజయం సాధించింది. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నై టెస్టులో బంగ్లాదేశ్‌ను భారత్‌ చిత్తు చేస్తే.. దక్షిణాఫ్రికాతో సమానంగా నిలుస్తుంది. దీని తర్వాత కాన్పూర్ వేదికగా జరగనున్న ఇదే సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధిస్తే.. దక్షిణాఫ్రికాను వెనక్కి నెట్టడం ఖాయం.

టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా ఇప్పటివరకు మొత్తం 414 టెస్టు మ్యాచ్‌లు గెలిచింది.ఇంగ్లండ్‌ జట్టు రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్ ఇప్పటి వరకు మొత్తం 397 టెస్టు మ్యాచ్‌లు గెలిచింది. ఈ విషయంలో వెస్టిండీస్ జట్టు కూడా చాలా ముందుంది. ఇప్పటి వరకు ఆ జట్టు మొత్తం 183 టెస్టు మ్యాచ్‌లు గెలుపొందింది. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే.. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఓటముల కంటే విజయాలే ఎక్కువ నమోదు చేసిన జట్టుగా కూడా చరిత్ర సృష్టిస్తుంది. భారత్ ఇప్పటి వరకు 579 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో భారత్ 178 గెలిచి 178 ఓడిపోయింది. కాగా 222 మ్యాచ్‌లు డ్రాతో ముగిశాయి. ఇది కాక WTC ఫైనల్ కు అర్హత సాదించాలి అంటే టీమిండియా బంగ్లాదేశ్ పై విజయం సాధించాల్సి ఉంది. దీంతో టీమిండియాకు బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్ అత్యంత కీలకంగా మారింది.

Also Read: Hyderabad: ఓల్డ్ సిటీ హిందువులదే: కేంద్ర మంత్రి బండి