Site icon HashtagU Telugu

IND vs BAN 2nd Test: నేడు భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ‌ధ్య చివ‌రి టెస్టు..!

IND vs BAN

IND vs BAN

IND vs BAN 2nd Test: భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో రెండో, చివరి (IND vs BAN 2nd Test) మ్యాచ్ నేడు జరగనుంది. ఈ మ్యాచ్ కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరగనుంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌తో మ‌రికాసేప‌ట్లో జ‌ర‌గ‌నున్న రెండో టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. దీనితో పాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023-25 ​​కోసం ఫైన‌ల్ పోటీకి వెళ్ల‌టానికి కూడా టీమిండియా దృష్టి పెట్టింది.

కాన్పూర్ పిచ్ ఎలా ఉంది?

కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియం భారతదేశానికి ఎప్పుడూ ల‌క్కీగానే ప్రూవ్ అయింది. 1983 నుంచి ఈ మైదానంలో భారత్ ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. వరుసగా 41 ఏళ్లుగా జట్టు ఈ గ్రౌండ్‌లో విజయాల పరంపరను కొనసాగిస్తోంది. 1983 నుంచి ఈ స్టేడియంలో టీమ్ ఇండియా మొత్తం 9 టెస్టు మ్యాచ్‌లు ఆడింది. అందులో టీమ్ 5 మ్యాచ్‌లు గెలిచింది. అదే సమయంలో జట్టు 4 మ్యాచ్‌ల్లో డ్రా చేసింది. కాన్పూర్‌లోని ఈ స్టేడియం పిచ్‌ను నల్లమట్టితో తయారు చేశారు. ఇది ఇక్కడి స్పిన్ బౌలర్లకు చాలా సహాయాన్ని అందిస్తుంది. కాగా తొలి రెండు రోజులు పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతో ఇక్కడ బ్యాటింగ్ చేయడం సులువు అవుతుంది. దీంతో టాస్ గెలిచిన జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ ఎంచుకునే అవ‌కాశాలు ఎక్కువ‌.

Also Read: Devara Review Rating : దేవర రివ్యూ & రేటింగ్

కాన్పూర్‌లోని ఈ స్టేడియంలో టాస్ పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు మొత్తం 23 టెస్టు మ్యాచ్‌లు ఆడగా.. అందులో ఒక్కసారి మాత్రమే టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. 1964లో జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ ఇండియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో టీమిండియా డ్రాగా ఆడింది. ఈ మైదానంలో ఇప్పటి వరకు 23 టెస్టు మ్యాచ్‌లు ఆడిన టీమిండియా 7 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 3 మ్యాచ్‌ల్లో టీమిండియా ఓటమి చవిచూసింది. అదే సమయంలో ఈ మైదానంలో 13 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

ఈ మైదానంలో స్పిన్ బౌలర్లకు సహకారం తప్పకుండా లభిస్తుంది. అందుకే ఈ మ్యాచ్‌లో ముగ్గురు స్పిన్ బౌలర్లతో టీమ్ ఇండియా రంగంలోకి దిగవచ్చు. ఇందులో ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా కూడా తొలి టెస్టు మ్యాచ్‌లో జట్టులో భాగమయ్యారు. ఇప్పుడు టీమ్ మేనేజ్‌మెంట్‌కు అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌ల‌లో ఒక్క‌రికి అవ‌కాశం క‌ల్పించ‌నున్న‌ట్లు స‌మాచారం.