IND vs AUS: ఇషాన్ కిషన్ అత్యుత్సాహం

గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 భారీ టార్గెట్ ఆసీస్ ముందుంచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తుఫాన్ ఇనింగ్స్ ఆడటంతో సెంచరీ నమోదు చేశాడు.

IND vs AUS: గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 222 భారీ టార్గెట్ ఆసీస్ ముందుంచింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ తుఫాన్ ఇనింగ్స్ ఆడటంతో సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాపై పొట్టి క్రికెట్లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రుతురాజ్రికార్డు సృష్టించాడు. అయితే టీమిండియా బౌలర్ల వైఫల్యం కారణంగా మూడో మ్యాచ్ చేజారింది.

చివరి రెండో ఓవర్లలో భారత బౌలర్లు 43 పరుగులను డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఆఖరి రెండు ఓవర్లు వేసిన అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ ధారాళంగా పరుగులిచ్చారు. ఇక వీళ్లకు తోడు వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ అత్యుత్సాహం కొంపముంచింది. 19వ ఓవర్లో అక్షర్ పటేల్ 22 పరుగులు ఇచ్చాడు. అక్షర్ వేసిన 19వ ఓవర్ తొలి మూడు బంతుల్లో 4, 2,4 వచ్చాయి. అయితే నాలుగో బంతికి వేడ్‌ను అవుట్ చేసే క్రమంలో భారీ మిస్టేక్ చోటు చేసుకుంది. బంతిని కొట్టేందుకు క్రీజు దాటిన వేడ్‌ను స్టంపౌట్ చేసేందుకు ఇషాన్ కిషన్ బంతి అందుకుని వికెట్లను గిరాటేసి అపీల్ చేశాడు. అయితే ఇషాన్ స్టంప్స్‌ను పడగొట్టే లోపే వేడ్ క్రీజ్‌లో పాదం పెట్టేశాడు. అంతే కాదు బంతి వికెట్లను పూర్తిగా దాటకుండానే ముందే బంతిని అందుకుని స్టంపౌట్ కు ప్రయత్నించాడు. ఇది గుర్తించిన థర్డ్ అంపైర్ నోబాల్ ఇచ్చాడు. మరుసటి బంతిని అక్షర్ ఫ్రీహిట్‌గా వేయాల్సి రావడంతో వేడ్ సిక్స్‌ బాదాడు. ఈ మిస్టేక్ కూడా టీమిండియా ఓటమికి ఒక కారణమైంది.

Also Read: H1B Visa : గుడ్ న్యూస్.. హెచ్‌-1బీ వీసాల రెన్యూవల్ ఇక అమెరికాలోనే