Site icon HashtagU Telugu

Virat Kohli: మెల్‌బోర్న్ స్టేడియంలో సెక్యూరిటీ లోపం.. గ్రౌండ్‌లో విరాట్ భుజంపై చెయి వేసి ఫొటోల‌కు ఫోజు!

Virat Kohli

Virat Kohli

Virat Kohli: మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు ఓ అభిమాని చేసిన ప‌ని సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ సెక్యూరిటీ గార్డును తప్పించబోయి అభిమాని మైదానంలోకి దిగాడు. అభిమాని భారత దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli)ని కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. ఇది ఊహించని విధంగా ఆటకు అంతరాయం కలిగించింది.

అతని చర్యపై సెక్యూరిటీ గార్డు వెంటనే చర్యలు తీసుకొని అతనిని మైదానం నుండి బయటకు పంపారు. కొంత సమయం తర్వాత ఆట మళ్లీ ప్రారంభమైంది. అభిమాని ముందుగా కెప్టెన్ రోహిత్ శర్మ వైపు పరుగెత్తాడు. ఆపై విరాట్ వైపు వచ్చాడు. అయితే అభిమాని విరాట్‌ను కౌగిలించుకోలేకపోయాడు. కానీ అతను భారత క్రికెటర్ భుజంపై చేయి వేసి ఫోటోల‌కు ఫోజులిచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది.

Also Read: CM Revanth New Demand: సీడ‌బ్ల్యూసీ స‌మావేశంలో సీఎం రేవంత్ న‌యా డిమాండ్‌!

విరాట్ కొత్త వివాదానికి తెర లేపాడు

ఈ సంఘటన MCG వద్ద జరిగింది. అక్కడ కోహ్లీ ఆస్ట్రేలియా అభిమానుల నుండి నిరంతరం దాడికి గురవుతున్నాడు. ఈ సమయంలో అతను కూడా ఆందోళ‌న‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. మెల్‌బోర్న్ టెస్టు తొలి రోజున అరంగేట్రం ఆటగాడు సామ్ కాన్‌స్టాస్‌ను భుజాన్ని కావాలని ఢీకొట్టి విరాట్ వార్తల్లో నిలిచాడు. ఇలా చేసినందుకు విరాట్ చాలా మంది మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఐసీసీ కూడా 20 శాతం జ‌రిమానా విధించిన విష‌యం తెలిసిందే.

విరాట్ మ్యాచ్ ఫీజు కోత

తొలిరోజు ఆట ముగిసిన తర్వాత కాన్‌స్టాస్‌ను భుజంతో ఢీ కొట్టినందుకు విరాట్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానా విధించారు. ఆస్ట్రేలియన్ మీడియా, రికీ పాంటింగ్‌తో సహా పలువురు మాజీ ఆస్ట్రేలియన్ క్రికెటర్లు విరాట్ చ‌ర్య‌పై విమ‌ర్శ‌లు చేశారు. కోహ్లీపై తాము కఠినమైన శిక్షను ఆశిస్తున్నామని అన్నారు.