ICC World Cup Final 2023: కప్పు కొట్టాల్సిందే.. ఫుల్ జోష్ లో టీమిండియా

ICC World Cup Final 2023: అందరి అంచనాలకు తగ్గట్టే ఇండియా ఫైనల్స్‌కు చేరింది.

Published By: HashtagU Telugu Desk
World Cup 2023 (26)

World Cup 2023 (26)

ICC World Cup Final 2023: అందరి అంచనాలకు తగ్గట్టే ఇండియా ఫైనల్స్‌కు చేరింది. దస్‌ కా దస్‌ అన్నట్టు దుమ్మురేపుతూ ఓటమి ఎరుగని జట్టుగా ఇండియా టైటిల్‌ ఫైట్‌కు రెడీ అయింది. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచ కప్‌ ఫైనల్లో ఇండియా ఆస్ట్రేలియా ఫైనల్లో ఆడుతున్నాయి. ఈ సారి టీమిండియా విజయావకాశాలు ఎలా ఉన్నాయి.. ? ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ను చిత్తు చేయాలంటే ఏం చేయాలి? ఎలా ఆడాలి? టీమిండియా ఓటమి ఎరుగని జట్టుగా రికార్డును కంటిన్యూ చేస్తుందా?

We’re now on WhatsApp. Click to Join.

ఆదివారం… కోట్లాది మంది భారతీయులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రోజు. వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి. అహ్మదాబాద్ వేదికగా గ్రాండ్ ఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఇరవై ఏళ్ల కిందటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఓటమి ఎరుగని జట్టుగా మమ్మల్ని ఓడించే మొనగాడే లేడన్నట్టు ఆడుతున్న టీమిండియా ఈ వరల్డ్‌ కప్‌లో కంచుకోటలా కనిపిస్తోంది. ఈ ప్రపంచ కప్‌లో హిట్‌ మ్యాన్‌ టీమ్‌ ఆడుతున్నట్టు ఇండియా ఇంతకు ముందు ఎప్పుడూ ఆడలేదు.

Also Read: BRS vs Congress : ప‌క్కా లోక‌ల్ అంటున్న స‌త్తుప‌ల్లి కాంగ్రెస్ అభ్య‌ర్థి.. నాలుగో సారి గెలుస్తానంటూ స‌వాల్ చేస్తున్న బీఆర్ఎస్ అభ్య‌ర్థి.. బ‌రిలో గెలిచి నిలిచేది ఎవ‌రు..?

ఏవో ఒకటి రెండు సమస్యలు మినహాయించి ఇండియా టీమ్‌ మహా స్ట్రాంగ్‌ గా తయారైంది. శత్రు దుర్బేధ్యంలా తయారైన రోహిత్‌ అండ్‌ కోకు బ్యాటింగ్‌ బ్రహ్మాండమైన బలమైతే పేస్‌ ఆల్‌ రౌండర్స్, స్పిన్‌ ఆల్‌ రౌండర్స్‌, స్పెషలిస్ట్‌ ఆల్‌ రౌండర్స్‌ టీమిండియాకు అడిషనల్‌ అడ్వాంటేజ్‌. ఒకరకంగా చెప్పాలంటే టీమిండియాకు ఇలాంటి జట్టు ఎప్పుడూ ఎన్నడూ దొరకలేదు. సూపర్‌ కంపోజిషన్‌తో బ్రహ్మాండంగా ఆడుతున్న భారత్‌ ఈ ఫైనల్లోనూ గెలిచి నెగ్గి మూడోసారి ప్రపంచ కప్‌ను ముద్దాడాలని కదన కుతూహలంతో ఉంది.

1983లో..

1983లో భారత్ తొలిసారి కపిల్ దేవ్ కెప్టెన్సీలో ఈ ప్రతిష్ఠాత్మక ట్రోఫీని అందుకుంది. తర్వాత 2011లో ధోనీ నాయకత్వంలో ఫైనల్లో శ్రీలంకపై గెలిచి ఇండియా ప్రపంచ కప్ విజేతగా నిలిచింది. 2023 ప్రపంచ కప్ టైటిల్ ఫేవరెట్‌ జట్లలో టీమిండియా ది టాప్ ప్లేస్‌. ఆస్ట్రేలియాతో మ్యాచ్ సహా తొమ్మిది లీగ్ మ్యాచ్‌లు, న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ కలిపి పదికి పది మ్యాచులూ గెలిచిన రోహిత్ శర్మ బృందంలో విజయోత్సాహం ఉరకలెత్తుతోంది. ఓటమి ఎరుగని జట్టుగా ప్రపంచ రికార్డును తిరగరాసిన రోహిత్‌ సేన అదే ఫామ్‌ను కంటిన్యూ చేయబోతోంది. బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరుగులేని ఫామ్‌లో ఉండటం, బౌలర్లు కూడా పోటా పోటీగా రాణిస్తుండడంతో మన వాళ్లే మొనగాళ్లు కాబోతున్నారన్న ధైర్యాన్ని రెట్టింపు(ICC World Cup Final 2023) చేస్తున్నాయి.

  Last Updated: 19 Nov 2023, 07:11 AM IST