ICC T20 Rankings: టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. నెంబర్‌ వన్‌ స్థానంలోనే సూర్యకుమార్‌ యాదవ్‌..!

  • Written By:
  • Updated On - June 20, 2024 / 08:52 AM IST

ICC T20 Rankings: ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 2024 ఇప్పుడు సూపర్ 8 దశకు చేరుకుంది. మొత్తం 8 జట్లు సూపర్‌ఎయిట్‌లోకి ప్రవేశించాయి. భారత్‌తో పాటు బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను గ్రూప్-1లో ఉంచారు. వెస్టిండీస్, అమెరికా, దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌లు గ్రూప్-2లో చోటు దక్కించుకున్నాయి. జూన్ 19న దక్షిణాఫ్రికా, అమెరికా మధ్య సూపర్ 8 తొలి మ్యాచ్ జరగనుంది. జూన్ 20న ఆఫ్ఘనిస్థాన్‌తో భారత జట్టు మ్యాచ్ ఆడనుంది.

ప్రపంచకప్‌లో భాగంగా ఐసీసీ బుధవారం (జూన్ 19) తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను (ICC T20 Rankings) విడుదల చేసింది. ఈసారి టీ20 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన మార్కస్ స్టోయినిస్ ఇప్పుడు టీ20 క్రికెట్‌లో నంబర్-1 ఆల్ రౌండర్‌గా నిలిచాడు. స్టోయినిస్‌కు 231 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. కాగా ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన మహ్మద్ నబీ నాలుగో స్థానానికి (213 పాయింట్లు) పడిపోయాడు. శ్రీలంక కెప్టెన్ వనిందు హసరంగ (222 పాయింట్లు) రెండో స్థానంలో, బంగ్లాదేశ్‌కు చెందిన షకీబ్ అల్ హసన్ (218 పాయింట్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

Also Read: 18799 Jobs : బంపర్ ఆఫర్.. మూడింతలు పెరిగిన రైల్వే ఏఎల్‌పీ జాబ్స్

అగ్రస్థానంలో సూర్య, కోహ్లి-రోహిత్ స్థానాలివే

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో టాప్-4లో ఎలాంటి మార్పు లేదు. భారత బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ 837 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో, ఫిల్ సాల్ట్ రెండో స్థానంలో, బాబర్ ఆజం మూడో స్థానంలో, మహ్మద్ రిజ్వాన్ నాలుగో స్థానంలో ఉన్నారు. మరోవైపు ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్ స్టార్ నికోలస్ పూరన్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి చేరుకున్నాడు. స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కూడా ర్యాంకింగ్స్‌లో కిందకి పడిపోయారు. కోహ్లి, రోహిత్‌లు చెరో రెండు స్థానాలు దిగజారి వరుసగా 50వ, 51వ స్థానాల్లో నిలిచారు. రింకూ సింగ్ కూడా రెండు స్థానాలు దిగజారి 37వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

We’re now on WhatsApp : Click to Join

బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ భారీగా లాభపడ్డాడు. అకిల్ ఆరు స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇంగ్లండ్‌కు చెందిన ఆదిల్ రషీద్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. అల్జారీ జోసెఫ్ కూడా ఆరు స్థానాలు ఎగబాకి 11వ స్థానానికి చేరుకున్నాడు. కాగా, వెస్టిండీస్‌కు చెందిన గుడాకేష్ మోతీ 16 స్థానాలు ఎగబాకి 13వ స్థానానికి చేరుకున్నాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ ఇప్పుడు రెండు స్థానాలు దిగజారి 9వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.