Site icon HashtagU Telugu

ICC Emerging Cricketer: 2024లో ఐసీసీ మెచ్చిన ఆట‌గాడు ఎవ‌రో తెలుసా?

ICC Emerging Cricketer

ICC Emerging Cricketer

ICC Emerging Cricketer: ఐసీపీ జనవరి 26న కమిందు మెండిస్‌ను ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ 2024 (ICC Emerging Cricketer) టైటిల్‌కు ఎంపిక చేసింది. ఈ శ్రీలంక ఆటగాడు 2024లో అద్భుత ప్రదర్శన చేశాడు. మెండిస్ మూడు ఫార్మాట్లలో తన సత్తాను నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఈ వర్ధమాన బ్యాట్స్‌మన్‌కి ICC పెద్ద అవార్డును అందజేసింది.

క‌మిందు మెండిస్‌కు క‌లిసొచ్చిన 2024

గతేడాది శ్రీలంక తరఫున కమిందు మెండిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో 50 కంటే ఎక్కువ సగటుతో పరుగులు చేశాడు. ఈ ఎడమచేతి వాటం ఆటగాడు 2024 సంవత్సరానికి ముందు శ్రీలంక తరపున 1 టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. కానీ 2024 సంవత్సరంల, ఈ ఆటగాడు అన్ని ఫార్మాట్లలో తన ఆట‌తీరుతో అభిమానుల‌ను అల‌రంచాడు. ఇటీవల ముగిసిన క్యాలెండర్ ఇయర్‌లో 1000 కంటే ఎక్కువ పరుగులు చేసిన 2024 సంవత్సరపు బ్యాట్స్‌మెన్‌లలో మెండిస్ ఒకడు. ఇది మాత్ర‌మే కాదు.. మెండిస్ తన పేరిట 5 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలు సాధించాడు.

Also Read: Shubman Gill: ఎట్ట‌కేల‌కు నిజం ఒప్పుకున్న గిల్‌.. అందుకే ప‌రుగులు చేయ‌లేక‌పోతున్నాడ‌ట‌!

శ్రీలంక తరఫున మెండిస్ 10 టెస్టు మ్యాచ్‌ల్లో 74 సగటుతో 1110 పరుగులు చేశాడు. ఈ సమయంలో ఈ ఆటగాడు 5 సెంచరీలు కాకుండా అతని పేరు మీద 4 అర్ధ సెంచరీలు సాధించాడు. 17 వన్డేలు ఆడిన మెండిస్ 31.27 సగటుతో 344 పరుగులు చేశాడు. 23 టీ-20 మ్యాచ్‌ల్లో ఈ ఆటగాడు 19.05 సగటుతో 381 పరుగులు చేశాడు.

అయితే యశస్వి జైస్వాల్, నితీష్ రెడ్డిలకు ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ టైటిల్ ఇవ్వలేదు. ఈ టైటిల్ కోసం ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా పోటీ పడ్డారు. ఎడమచేతి వాటం ఆటగాడు యశస్వి 2024లో అద్భుత ప్రదర్శన చేశాడు, డబుల్ సెంచరీతో పాటు పలు సెంచరీలు కూడా చేశాడు. య‌శ‌స్వితోపాటు నితీష్ కుమార్ రెడ్డి T-20 ఫార్మాట్‌లో భారతదేశం తరపున అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆస్ట్రేలియాలో ఆడిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తన బ్యాటింగ్ నైపుణ్యాన్ని నిరూపించుకున్నాడు. ఈ సిరీస్‌లో సెంచరీ కూడా చేశాడు.