T20 World Cup: టి20 ప్రపంచకప్ ముగిసినా ఆ క్షణాలను భారతీయులు ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఒకటా రెండా 17 ఏళ్ళ నాటి కల రోహిత్ సారధ్యంలో నిరవేరింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో భారత్ విజయకేతనం ఎగరేసింది. టీమిండియా గెలిచినప్పటికీ సౌతాఫ్రికాను తక్కువ చేసి చూడలేం. తొలి టైటిల్ కోసం ఆ జట్టు పోరాడి ఓడింది. ఓటమి అనంతరం ఆ జట్టు ఆటగాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. తృటిలో కప్ చేజారడంతో తట్టుకోలేకపోయారు. ఏదేమైనప్పటికీ విజయం ఒక అంచునే ఉంటుంది కాబట్టి ఓటమిని యాక్సెప్టు చెయ్యక తప్పదు.
టోర్నీ ముగిసి పది రోజులు దాటినా ఆ క్షణాలు క్రికెట్ ఫ్యాన్స్ మర్చిపోలేక పోతున్నారు. తాజాగా ఐసీసీ మళ్ళీ ఫైనల్ మ్యాచ్ హైలెట్స్ ని ప్రకటించింది. ఐసీసీ(ICC) ప్రకారం టోర్నీ హైలెట్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)నే కావడం విశేషం. ఫైనల్లో సౌతాఫ్రికా ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌ను బుమ్రా కళ్లు చెదిరే ఔట్ స్వింగర్‌తో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ బాల్‌ను వరల్డ్ కప్ బెస్ట్ డెలివరీస్ లిస్ట్‌లో చేర్చింది ఐసీసీ. ఈ డెలివరీ టోర్నీలోనే టాప్‌లో నిలిచింది. ఇక సెమీస్‌లో ఆఫ్ఘానిస్థాన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీని బౌల్డ్ చేశాడు సౌతాఫ్రికా స్టార్ పేసర్ రబాడ. ఇది సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఆస్ట్రేలియా విధ్వంసకారుడు గ్లెన్ మాక్స్‌వెల్‌ను స్కాట్లాండ్ స్పిన్నర్ మార్క్ వాట్ చక్కటి డెలివరీతో ఔట్ చేశాడు. ఇది కూడా లిస్ట్‌లో చోటు దక్కించుకుంది.
న్యూజిలాండ్ బ్యాటర్ ఫిన్ అలెన్‌ను ఆఫ్ఘాన్ పేసర్ ఫజల్హక్ ఫారుకీ క్లీన్ బౌల్డ్ చేసిన డెలివరీ, ఐర్లాండ్ బ్యాటర్ ఆండ్రూ బాల్బిరిన్ను పాకిస్థాన్ పేసర్ షాహిన్ ఆఫ్రిదీ పర్ఫెక్ట్ ఔట్ స్వింగర్‌తో వెనక్కి పంపిన బంతులు కూడా బెస్ట్ డెలివరీస్ లిస్ట్‌లో చేర్చింది. ఓవరాల్ గా ఐసీసీ లీస్ట్ చేసిన ఈ హైలెట్స్ ఒక్కోటి ఒక్కో డైమండ్ అనే చెప్పాలి.
Also Read: KKR New Mentor: కేకేఆర్ మెంటర్ అతడేనా..?