ICC Champions Trophy: వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి (ICC Champions Trophy) పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీంతో ఈ టోర్నీ కోసం పాకిస్థాన్‌లో పర్యటించేందుకు టీమిండియా నిరాకరించింది. దీని తర్వాత ICC టోర్నమెంట్‌ను హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించాలని PCB ముందు ఒక షరతు పెట్టింది. అయితే PCB మొదట దానిని తిరస్కరించింది. తర్వాత షరతుతో అంగీకరించింది. మరోవైపు ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇంకా వెల్లడి కాలేదు.
విరాట్-రోహిత్ ఆడలేరా?
ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2024 టోర్నమెంట్‌ను ODI కాకుండా T20 ఫార్మాట్‌లో నిర్వహించవచ్చని చాలా మీడియా నివేదికలు వస్తున్నాయి. నిజంగా ఇదే జరిగితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడటం కష్టమే. ఎందుకంటే 2024 టీ20 వరల్డ్ కప్ టైటిల్ గెలిచిన తర్వాత రోహిత్, విరాట్ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. మరి ఈ టోర్నీ కేవలం వన్డే ఫార్మాట్‌లోనే జరుగుతుందా లేక టీ20 ఫార్మాట్‌లోకి మారుతుందా అనేది చూడాలి. అయితే ఈ విషయంలో ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు.
Also Read: Mohan Babu Apology: తగ్గిన మోహన్ బాబు.. క్షమాపణలు చెబుతూ లేఖ!
ఇకపోతే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ ట్రోఫీని ఏ ఫార్మాట్‌లో నిర్వహిస్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఐసీసీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది
నివేదికల ప్రకారం.. ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్‌లో నిర్వహించడానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంగీకరించింది. అయితే దీనిపై ఐసీసీ ముందు పాకిస్థాన్ షరతు పెట్టింది. 2027 వరకు భారత్‌లో జరిగే అన్ని ఐసీసీ టోర్నమెంట్‌లలో పాకిస్థాన్ కూడా హైబ్రిడ్ మోడల్‌లోనే ఆడాలని, అంటే ఐసీసీ టోర్నమెంట్‌ల కోసం పాకిస్థాన్ కూడా భారత్‌లో పర్యటించకూడదని పాకిస్థాన్ కోరుతోంది.